ప్రజా సమస్యలపై వైయస్సార్సీపీ పోరాటం

తూర్పుగోదావరి జిల్లా: ప్రజా సమస్యలపై పోరాడేందుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆ పార్టీ ముమ్మిడివరం నియోజకవర్గ కో–ఆర్డినేటర్‌ పితాని బాలకృష్ణ స్పష్టం చేశారు. ఐ. పోలవరం మండలం టీ.కొత్తపల్లి గ్రామంలో పితాని ఆధ్వర్యంలో గడప గడపకూ వైయస్‌ఆర్‌ కార్యక్రమం నిర్వహించారు. గ్రామానికి వచ్చిన పితాని బాలకృష్ణకు ప్రజలు తమ సమస్యలను చెప్పుకున్నారు. టీడీపీ ప్రభుత్వం ఓట్ల కోసం మమ్మల్ని నమ్మించి మోసం చేసిందని ప్రజలంతా వాపోయారు. అనంతరం పితాని మాట్లాడుతూ... త్వరలోనే మహానేత వైయస్‌ఆర్‌ పరిపాలన ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో వస్తుందన్నారు. వైయస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకుంటే ప్రజా సమస్యలన్ని శాశ్వతంగా పరిష్కారం అవుతాయని భరోసా కల్పించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు శ్రీనివాసరాజు, విజయ్‌కుమార్, శ్రీహరి, రామరాజు, శర్మ తదితరులు పాల్గొన్నారు. 

Back to Top