ప్రజలకు కొండంత అండగా వైయస్సార్సీపీ

  • రాష్ట్రంలో పడకేసిన పాలన
  • టీడీపీపై ప్రజల ఆగ్రహం
  • వైయస్సార్సీపీ నేతలకు సమస్యల విన్నపం

ఏ వీధికి వెళ్లినా స‌మ‌స్య‌లే ద‌ర్శ‌న‌మిస్తున్నాయ‌ని వైయ‌స్సార్సీపీ నెల్లూరు ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాద‌వ్ అన్నారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కార్య‌క్ర‌మంలో భాగంగా  నియోజ‌క‌వ‌ర్గంలోని కపాడిపాళెంలో ప‌ర్య‌టించారు. డ్రైనేజీ స‌మ‌స్య‌ను తీర్చాల‌ని సంబంధిత అధికారులకు తెలియ‌జేసినా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ప్రజలు వాపోయారు. ఎస్సీ, ఎస్టీ గ్రాంటు కింద నెల్లూరు న‌గ‌రానికి రూ. 42 కోట్లు, డివిజ‌న్‌కు రూ. 2 కోట్లు మంజూర‌య్యాయ‌ని ఆ నిధుల‌తో స‌మ‌స్య‌ల‌ను వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని సంబంధిత అధికారుల‌ను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్ర‌మంలో డిప్యూటీ మేయ‌ర్ ముక్కాల ధ్వార‌క‌నాథ్‌, కార్పొరేట‌ర్లు ర‌విచంద్ర‌, మాధ‌వ‌య్య‌, నాగ‌రాజు, అశోక్‌, నాయ‌కులు మ‌హేష్‌, రంగా, బాలాప్ర‌సాద్‌, క‌ల్ప‌న, త‌దిత‌రులు పాల్గొన్నారు. 

తాను అధికారంలోకి వ‌స్తే రూ. ల‌క్ష 50 వేల‌తో ప‌క్కా ఇళ్లు నిర్మిస్తాన‌న్న చంద్ర‌బాబు హామీ ఏమైంద‌ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి ప్ర‌శ్నించారు.  న‌గ‌రంలోని 36, 37 డివిజ‌న్లు, మండ‌ల పరిధిలోని దొంతాలి గ్రామంలో గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయస్సార్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఇంటింటికి వెళ్లి వంద ప్ర‌శ్నాల‌తో కూడిన క‌ర‌ప‌త్రాన్ని ప్ర‌జ‌ల‌కు అంద‌జేశారు. మోసపూరిత హామీలతో వంచించిన బాబుకు సున్నా మార్కులు వేశారు.


విశాఖ జిల్లా చోడవరం కన్వీనర్ కరణం ధర్మశ్రీ రాజాంలో గడపగడపలో పర్యటించారు. ఈసందర్భంగా ప్రజలు తమ సమస్యలను ధర్మశ్రీకి మొరపెట్టుకున్నారు. పింఛన్ రావడం లేదని వృద్ధులు ధర్మశ్రీ వద్ద వాపోయారు . 


గడప గడపకూ వైయస్సార్ కార్యక్రమములో భాగంగా విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ కశింకోట మండలం బంగారయ్య పేటలో గడప గడపకి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో  గొల్లవల్లి  శ్రీను ,శ్రీధర్ రాజు  ,గణేష్  ,జగన్ ,శేఖర్ ,ఇల్లపు శ్రీను తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఆళ్లగడ్డ నియోజకవర్గ ఇంఛార్జ్ రామలింగారెడ్డి గడపగడకూ వెళ్లి బాబు మోసాలను ఎండగడుతున్నారు. అదేసమయంలో ప్రజల కష్టాలు తెలుసుకొంటూ వారిలో భరోసా కల్పిస్తున్నారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రిని చేసుకుంటేనే మన కష్టాలు తీరుతాయని ప్రతీ గడపలో వివరిస్తున్నారు. 


Back to Top