రైతుల కోసం పోరాడే ఏకైక పార్టీ వైయస్సార్సీపీ

హంద్రీ-నీవా ఆయ‌క‌ట్టుకు నీరిస్తారా?  లేదా?
హంద్రీ-నీవా సుజల స్ర‌వంతి ప‌థ‌కం మొద‌టి ద‌శ ఆయ‌క‌ట్టుకు సాగునీరు ఇస్తారా... లేదా అనేది సీఎం చంద్ర‌బాబు స్ప‌ష్టం చేయాలని వైయ‌స్సార్‌సీపీ ఉర‌వ‌కొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వ‌ర‌రెడ్డి డిమాండ్ చేశారు. క‌ళ్యాణ‌దుర్గం నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త ఉష‌శ్రీ‌చ‌ర‌ణ్ ఆధ్వ‌ర్యంలో శెట్టూరు మండ‌లం కైరేవులో గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కార్య‌క్ర‌మం కార్య‌క్ర‌మంలో విశ్వేశ్వ‌ర‌రెడ్డి పాల్గొన్నారు. ఆయ‌కట్టుకు నీరివ్వాల‌ని రైతులు సీఎంను నిల‌దీస్తే చెరువుల‌కు ఇస్తాం త‌ప్ప ఆయ‌క‌ట్టుకు ఇవ్వడం సాధ్యం కాద‌ని నిస్సిగ్గుగా చెప్ప‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌న్నారు. 

మాకు సాగునీటి అదృష్టం లేదా..?
వ‌డాలి(ముదినేప‌ల్లి రూర‌ల్‌)  రైతుల‌ను మోసం చేసే ప్ర‌భుత్వాలు ఎక్కువ కాలం మ‌నుగ‌డ సాగించ‌లేవ‌ని, అందుకు భ‌విష్య‌త్తులో త‌గిన మూల్యం చెల్లించుకోవాల్సి వ‌స్తుంద‌ని ప‌లువురు రైతులు పేర్కొన్నారు. వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ మండ‌ల అధ్య‌క్షుడు బ‌డుగు భాస్క‌ర‌రావు ఆధ్వ‌ర్యంలో గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. జూన్ రెండోవారంలో సాగు నీరందిస్తామ‌ని ప్ర‌గ‌ల్బాలు ప‌లికిన ప్ర‌భుత్వం ఇప్ప‌టి వ‌ర‌కు చుక్క‌నీరు ఇవ్వ‌లేద‌ని  రైతులు నిప్పులు చెరిగారు. రైతుల‌ను మోసం చేసే రాజ‌కీయ పార్టీల‌ను త‌న్ని త‌రిమేయాల‌ని భాస్క‌ర‌రావు పిలుపునిచ్చారు. రైతుల కోసం పోరాడే ఏకైక పార్టీ వైయ‌స్సార్ సీపీ మాత్ర‌మేన‌ని స్ప‌ష్టం చేశారు. 


Back to Top