9 న కొత్తపేటలో వైయస్సార్‌ సీపీ నవరత్నాల సభ

కొత్తపేటః వైయస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహనరెడ్డి ఇచ్చిన తోమ్మిది హామీలు (నవరత్నాల) ను ప్రజల్లోకి తీసుకువెళ్ళేందుకు ముందుగా నియోజకవర్గ స్తాయి పార్టీ సభ ఈ నెల 9 న కొత్తపేటలో నిర్వహిస్తున్నట్టు ఎమెమల్యే చిర్ల జగ్గిరెడ్డి తెలిపారు. ఈ మేరకు సభ నిర్వహించేందుకు నిర్ధేశించిన స్థానిక శ్రీవాసవీకన్యకాపరమేశ్వరీ ఆర్యవైశ్య కళ్యాణ మండపాన్ని జగ్గిరెడ్డి సోమవారం పరిశీలించారు. ఈ సందర్బంగా ఏర్పాట్ల గురించి పార్టీ నాయకులతో సమీక్షించారు. ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాట్లాడుతూ.... పార్టీ అధినేత జగన్‌ ఇచ్చిన హామీలు పట్ల ప్రజలను చైతన్యవంతులను చేయాలని అందుకు ప్రతీ కార్యకర్త ఒక సైనికునిలా తయారవ్వాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.అందుకు ఈ 9 న నిర్వహించే సభ ద్వారా కార్యకర్తల్లో నూతనొత్తేజాన్ని నింపనున్నామన్నారు. కొత్తపేట,రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు మండలాల నుంచి పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు అత్యధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని జగ్గిరెడ్డి పిలుపునిచ్చారు.ఆ సభకు ఉభయగోదావరి జిల్లాలకు చెందిన పలువురు నాయకులను ముఖ్యఅతిధులుగా ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు.ఆయన వెంట రావులపాలెం ఎంపీపీ కోట చెల్లయ్య,జిల్లా పార్టీ సేవాదళ్‌ అధ్యక్షుడు మార్గన గంగాధరరావు,రాష్ట్ర ప్రచార కార్యదర్శి ముసునూరి వుంకటేశ్వరరావు,జిల్లా పార్టీ సభ్యుడు సత్యవరపు జమీందార్‌ తదితరులు ఉన్నారు.

తాజా ఫోటోలు

Back to Top