గడపగడపలో వైయస్సార్సీపీ జెండా రెపరెపలు

గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం ప్రకాశం జిల్లాలో విస్తృతంగా కొనసాగుతోంది. ప్రజల వద్దకు వెళ్లిన వైయస్సార్సీపీ శ్రేణులకు విశేష ఆదరణ లభిస్తోంది. పూలవర్షంతో  వైయస్సార్సీపీ నాయకులకు ఘనస్వాగతం పలుకుతున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం బ్రహ్మనపల్లి, అద్దంకి నియోజకవర్గం బందివారిపాలెం గ్రామంలో వైయస్సార్సీపీ  నాయకులు, కార్యకర్తలు గడపగడపలో పర్యటించారు. 


అబద్ధపు హామీలతో నయవంచన చేసిన చంద్రబాబు బాగోతాలనను గడపగడపలో ఎండగట్టారు. ప్రతీ ఒక్కరూ బాబు పాలనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.  బాబుకు ఓటేసినందుకు నట్టేట ముంచాడని  ప్రజలు వాపోయారు. అధైర్యపడొద్దని, అండగా వైయస్సార్సీపీ ఉంటుందని భరోసా కల్పించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చేవరకు బాబు ప్రభుత్వంపై పోరాడుదామని  పిలుపునిచ్చారు.  నేరవేర్చని పక్షంలో మన ప్రభుత్వం వచ్చాక జీవితాలను బాగుపర్చుకుందామని వారికి ధైర్యం చెప్పారు. 


Back to Top