వైయస్సార్‌ పాలన ఓ స్వర్ణయుగం

– నవరత్నాలతో పేదల జీవితాల్లో వెలుగులు
– వైయస్సార్‌ కుటుంబం కార్యక్రమంలో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి

మైదుకూరు టౌన్‌ : దివంగత ముఖ్యమంత్రి వైయస్‌.రాజశేఖర్‌రెడ్డి పాలన ఓ స్వర్ణయుగమని ఆ ప్రజా పరిపాలన మనకు మళ్లీ రావాలంటే వైయస్సార్‌ సీపీని ఆదరించి జగన్ననకు తోడుగా నిలవాలని మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి ప్రజలను కోరారు. వైయస్సార్‌ కుటుంబం కార్యక్రమం గురువారం 16లో గోశెట్టిలక్షుమయ్య ఆధ్వర్యంలో ,12వ వార్డులో చాపల షరీఫ్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్సార్‌ కార్యకర్తలు గడప గడపకూ తిరిగి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఎమ్మెల్యే రఘురామిరెడ్డి వైయస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే అమలు చేసే నవరత్నాల్లాంటి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. 9121091210 నంబర్‌కు మిస్డ్‌కాల్‌ ఇచ్చి వైయస్సార్‌ కుటుంబంలో చేరాలన్నారు. వైయస్సార్‌ ఫ్యామిలీలోకి స్వచ్ఛందంగా చేరిన వారికి స్వాగతం పలికారు. అధికారంలోకి రావడానికి చంద్రబాబులా అడ్డదిడ్డమైన హామీలి ఇవ్వడం జగన్‌కు సాథ్యం కాదన్నారు. వైయస్‌ కుటుంబం ఏదైనా మాట ఇస్తే తూచా తప్పకుండా అమలు చేసే నైజం వారి కుటుంబానికే దక్కుతుందనానరు. అన్నివర్గాల ప్రజలు, మహిళలు, రైతాంగాన్ని దృష్టిలో ఉంచుకొనే తమ పార్టీ అధినేత నవరత్నాలను ప్రకటించారని తెలిపారు. అధికారంలోకి రాగానే ఆ సంక్షేమ పథకాలను అమలు చేసి బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో వెలుగు నింపుతామన్నారు. అనంతరం ఇంటిటీకి తిరిగి వైయస్‌ర్‌ కుటుంభంలో ప్రజలను చేర్పించారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి ఇరగంరెడ్డి శంకర్‌రెడ్డి, గోశెట్టిలక్షుమయ్య, భూమిరెడ్డి సుబ్బరాయుడు, చొక్కం శివ, చంద్ర, సుబ్బారెడ్డి, చలమయ్య, తిరుమలయ్య, నరసింహారెడ్డి, మేకల చిన్నా, ప్రముఖ న్యాయవాధి జ్వాలా నరసింహశర్మ, చాపల్‌ షరీఫ్, కందునూరు షరీఫ్, కొండపేట షరీఫ్, గాంధీనగర్‌ నాగసుబ్బారెడ్డి, యూత్‌ మొంబర్‌ ప్రశాంత్‌రెడ్డి, కొండాభాస్కరెడ్డి, రాకెట్‌ ఆలం, సర్పంచ్‌ లెక్కల శివప్రసాద్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top