వైయస్ఆర్ సుపరిపాలన వైయస్ జగన్ తోనే సాధ్యం

మోసం చేయడమే బాబు నైజం
రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి బాబు నమ్మించి మోసం చేశారని పలువురు వైయస్సార్సీపీ పత్తికొండ నియోజకవర్గ ఇంఛార్జ్ సీహెచ్ నారాయణ రెడ్డి వద్ద వాపోయారు. గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా ఆయన పత్తికొండ టౌన్ లోని7,15,16,17 వార్డులలో పర్యటించారు. ఈసందర్భంగా ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వైయస్సార్ పాలనలో ప్రతీ కుటుంబానికి సంక్షేమ పథకాలు అందాయని, బాబు వచ్చాక తెలుగుదేశం వాళ్లకే లబ్ది చేకూరుస్తున్నారని ప్రజలు మండిపడ్డారు. మైసం చేయడం బాబు నైజమని..మరోసారి మోసపూరిత హామీతో ఓట్లు అడగడానికి వస్తాడని అప్రమత్తంగా ఉండాలని నారాయణరెడ్డి ప్రజలకు సూచించారు. 

బాబు పాలనపై ప్రజాగ్రహం
శ్రీశైలం నియోజకవర్గ ఇంఛార్జ్ బుడ్డా శేషారెడ్డి బండి ఆత్మకూరు మండలం సోమయాజులపల్లె గ్రామంలో గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ప్రజల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. బాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి ఇంటింటా కరపత్రాలు అందించి సమాధానాలు రాబట్టారు. ఈసందర్భంగా బాబు పాలనపై ప్రజలు దుమ్మెత్తిపోశారు.  టీడీపీ నాయకులు ఓట్ల కోసం  మళ్లీ తమ గడపకు వస్తే తరిమికొడతామని హెచ్చరించారు. 

బాబు పాలనకు చరమగీతం పాడుదాం
నర్సీపట్నం నియోజకవర్గ కన్వీనర్ పెట్ల ఉమాశంకర్ గణేష్ మండవల్లి మండలం సింగనపూడి గ్రామంలో గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. డ్వాక్రా రుణాలు మాఫీ కాలేదు, నిరుద్యోగ భృతి ఊసేలేదు ఏ ఒక్క సంక్షేమ పథకం అమలు కావడం లేదని ప్రజలు గణేష్ వద్ద మొరపెట్టుకున్నారు. ఈసందర్భంగా ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతూ...సంక్షేమ పథకాలను అమలు చేయకుండా అవినీతి పాలన సాగిస్తున్న బాబు పాలనకు చరమగీతం పాడుదామని పిలుపునిచ్చారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి సుపరిపాలన మళ్లీ రావాలంటే వైయస్ జగన్ తోనే సాధ్యమన్నారు. 

Back to Top