నవరత్నాల పథకాలతో వైయస్‌ఆర్ పాలన

చీడికాడ: వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాలతో నవ్యాంద్రాలో నాటి వైయస్‌ పాలన తిరిగి వస్తుందని ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు అన్నారు. గురువారం చీడికాడ గ్రామంలో వైయస్‌ఆర్‌ కుటుంబం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.ఈ మేరకు ఆయన మాట్లాడుతూ వైయస్‌ మరణానంతరం ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలు మరుగున పడ్డాయన్నారు.టి.డి.పి ప్రభుత్వం ప్రజా సంక్షేమమాన్ని మరిచి తమ నేతలు,పార్టీ కేడర్‌ ఎదుగులకు అవసరమైన పథకాలను అమలు చెస్తూ దోచుకుంటున్నారన్నారు.ఈ విషయాన్ని ప్రజలు గుర్తించారని ఎప్పుడెప్పుడు జగనన్నను ముఖ్యమంత్రిగా చెద్దామా అని ఎదురుచూస్తున్నారన్నారు. ఇదిలా ఉంటే తురువోలు శివారు తంగుడు బిల్లిలో వైయస్‌ఆర్‌ కుటుంబం కార్యక్రమాన్ని మండల పార్టీ అధ్యక్షులు యర్రా అప్పారావు,జిల్లా రైతు విభాగం అధ్యక్షులు సుంకర రుద్రిలు ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో మండల యువజన విభాగం అధ్యక్షులు గొల్లవిల్లి రాజుబాబుతో పాటు బూత్‌ కమిటీల అధ్యక్షులు యర్రా సన్యేసినాయుడు,కామిరెడ్డి ఎరుకునాయుడు,పరువాడ అప్పారావు,శిరికి దేముడునాయుడు,బలిజి దేముళ్లు,జె.వి.రమణ,జె.ప్రసాద్‌తో పాటు నేతలు పరువాడ రామారావు,కొండబాబు,గొర్లి దేముడు పాల్గొన్నారు. 
.................................
వైయస్ఆర్ కుటుంబానికి విశేష స్పందన
పాతపోస్టాఫీసు : దక్షిణ నియోజకవర్గం జీవీఎంసీ పరిధి 20,21, 22, 23, 25 వార్డుల్లో గురువారం చేపట్టిన వైయస్సార్‌ కుటుంబం కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకోవడంతో పాటు వైయస్సార్‌ కుటుంబం ఏర్పాటు చేయడంలో ముఖ్య లక్ష్యాన్ని, పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాలను ప్రజలకు వివరించారు. కరపత్రాలను పంపిణీ చేయడంతో పాటు స్టిక్కర్లను ఆయా ఇళ్లకు అతికించారు.
20 వార్డు అధ్యక్షుడు పీతల వాసు ఆధ్వర్యంలో ప్రకాశరావుపేట, అంథోనీనగర్‌ ప్రాంతాల్లో 50 ఇళ్లను సందర్శించారు. ఇందులో గండి అప్పలరాజు, డొప్ప సూరిబాబు, అడపాశివ, ఉమామహష్, వినయ్, జీవన్‌ తదితరులు పాల్గొన్నారు.
21వార్డు అధ్యక్షుడు దశమంతుల మాణిక్యాలరావు ఆధ్వర్యంలో మీది రెల్లివీధి, రెల్లివీధి, కొడిపందాలవీధుల్లో సుమారు 40 ఇళ్లను సందర్శించారు. కార్యక్రమంలో మహిళా నాయకురాలు డి.సీత, యలమాజి, బుజ్జి, సరోజిని తదితరులు ఉన్నారు.
22వ వార్డు అధ్యక్షుడు నొల్లు పోతురాజు ఆధ్వర్యంలో జబ్బర్‌తోట, పెయిందొరపేట, గొల్లవీధుల్లో సుమారు 60 ఇళ్లను సందర్శించారు. కార్యక్రమంలో చంటి, సతీష్, కాకరరాజు, ఆనంద్, శ్రీను, మహేష్, కనకరాజు తదితరులు పాల్గొన్నారు.
23వ వార్డు అధ్యక్షుడు అలమండ విజయకుమార్‌ ఆధ్వర్యంలో ఆశిపాపవీధి, గొడారిగోతులు, రెల్లి వీధుల్లోని 55 ఇళ్లను సందర్శించారు. ఈ కార్యక్రమంలో కోరుకొండ సూర్యప్రసాద్, కె.రాజు, జమీల్‌ తదితరులు పాల్గొన్నారు.
25వ వార్డు అధ్యక్షుడు సూరాడ తాతారావు ఆధ్వర్యంలో థాంసన్‌వీధి, కన్వేయర్‌బెల్ట్, అంబుసరంగ్‌వీధి, గాంధీపార్కు సెంటర్‌లలో సుమారు 55 ఇళ్లను సందర్శించారు. కార్యక్రమంలో సలీం, బుకారిఖాన్, అమీర్‌భాయ్, మాధురి, సునీత, సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.


Back to Top