రాజన్న స్వర్ణయుగం తెచ్చుకుందాం

విశాఖపట్నం: దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి సువర్ణ పాలనను తిరిగి తెచ్చుకునేందుకు ప్రజలంతా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో భాగస్వాములవుతున్నారని పార్టీ నేత బొడ్డేడ ప్రసాద్‌ అన్నారు. యలమంచిలి మండలం ఏటికొప్పాకలో బొడ్డేడ ప్రసాద్‌ ఆధ్వర్యంలో వైయస్‌ఆర్‌ కుటుంబం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాల ప్రయోజనాలను వివరించారు. రాష్ట్రంలోని దుర్మార్గ పాలనను తరిమికొట్టేందుకు ప్రజలు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ కార్యదర్శి గోవింద్, నాగిరెడ్డి అచ్చయ్యనాయుడు, రాము తదితరులు పాల్గొన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top