విస్తృతంగా వైయ‌స్‌ఆర్‌ కుటుంబం

నందవరం: మండల పరిధిలోని పెద్దకొత్తిలి, గురుజాల, రాయచోటి, టి.సోమలగూడూరు, నాగలదిన్నె గ్రామాల్లో మంగళవారం వైయ‌స్‌ఆర్‌ కుటుంబం కార్యక్రమం విస్తృతంగా నిర్వ‌హిస్తున్నారు. పెద్దకొత్తిలిలో 1, 2 వార్డుల్లోను, టి.సోమలగూడూరులో 12వ వార్డులోను, నాగలదిన్నెలో 3వ వార్డులో ఇంటింటికి తిరిగి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు. సంక్షేమ పథకాల పేరుతో పేదల నడ్డివిరుస్తుందని పేర్కొన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ప్రభుత్వ పాలన గూర్చి ఇంటింటికి వెళ్లి వివరించారు. మళ్లీ రాజన్న రాజ్యం వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో సుసాధ్యం చేయాలని కోరారు. నవరత్నాల ఫలాలు ప్రజలకు అందాలంటే రాబోయే ఎన్నికల్లో వైయ‌స్‌ జగన్‌ పాలన తీసుకు రావడానికి సిద్దం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం పార్టీ నాయకులు ఇంటింటికి తిరిగి పార్టీ సభ్యత్వాన్వి నమోదు చేశారు. అలాగే కరపత్రాలను పంపిణీ చేస్తూ వైఎస్‌ఆర్‌ కుటుంబంలో చేర్పించారు. ఈ కార్యక్రమంలో గురుజాల నరసింహారెడ్డి, డీలర్‌ నరసింహులు, రామాచంద్రారెడ్డి, రాజారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, బలరాం, నాగేశ్వరరెడ్డి, చిరుచైతన్యకుమార్‌రెడ్డి, ఉపేంద్రరెడ్డి, రతంగపాణిరెడ్డి, బాలముని, జయన్న, ఏలీష, దేవరాజు, రాయచోటి నరసింహారెడ్డి, సుదర్శనం, భీరప్ప, దేవేంద్ర, హరిజన మాదన్న, పౌలు, వడ్డే రాముడు, తెలుగు మల్లన్న, గొరక రామలింగప్ప, ఈరన్న, వెంకటేష్, చాకలిఈరన్న, పెద్దనరసింహుడు, చిన్ననరసింహులు, జయరాముడు, భీముడు, వడ్డే వీరేష్, ప్రతాప్‌ ఈరన్నశెట్టి, ఎస్సీ రంగన్న, ఉదయ్‌కుమార్, రాముడు, ప్రకాష్, జగదీష్, మల్లికార్జున, రాఘవరెడ్డి, శేఖర్, విజయ్, పెద్దరంగన్న, పరమేష్‌ తదితరులు పాల్గొన్నారు.
----------------------------
 వైయ‌స్‌ఆర్‌ కుటుంబంలో ప్రతి గడపను తట్టండి 
– నియోజకవర్గాల సమీక్షలో రవీంద్రనాథ్‌రెడ్డి 
కర్నూలు: వైయ‌స్‌ఆర్‌ కుటుంబంలో భాగంగా జిల్లాలోని ప్రతి గడపను తట్టాలని వైయ‌స్‌ఆర్‌సీపీ కర్నూలు జిల్లా అదనపు పరిశీలకుడు, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో వైఎస్‌ఆర్‌ కుటుంబంపై ఆయన నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు, ఇన్‌చార్జీలతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ గంగుల ప్రభాకరరెడ్డి, ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఐజయ్య, నియోజకవర్గ ఇన్‌చార్జీలు శిల్పా మోహన్‌రెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి, శ్రీదేవి, హఫీజ్‌ఖాన్, బుడ్డాశేషారెడ్డి, కాటసాని రామిరెడ్డి, గంగుల బిజేంద్రనాథ్‌రెడ్డి(నాని), బీవై రామయ్య తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గాల వారిగా సమీక్ష జరిపారు. సమావేశానికి రాని ప్రజాప్రతినిధులు,ఇన్‌చార్జీలతో ఫోన్‌ ద్వారా సమాచారాన్ని తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..కర్నూలు జిల్లాలో వైఎస్‌ఆర్‌ కుటుంబ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని, నాయకులు, కార్యకర్తలను సమన్వయ పరచి ఎక్కువ కుటుంబాలు వైయ‌స్‌ఆర్‌సీపీ సభ్యత్వాన్ని తీసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమాన్ని మరో 10 రోజులు పొడిగించడంతో ఇప్పటి వరకు సందర్శించని ఇళ్లకు వెళ్లాలని చెప్పారు. ప్రతి కుటుంబాన్ని సందర్శించి చంద్రబాబునాయుడు వైఫల్యాలు, నవరత్నాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు రాంపుల్లయ్యయాదవ్, నరసింహులు యాదవ్, ప్రదీప్‌రెడ్డి, ధనుంజయాచారి, అనిల్‌కుమార్, సాంబా, అశోక్, కటారి సురేష్‌ తదితరులు పాల్గొన్నారు. 
...................................
నేమకల్‌లో వైయ‌స్ఆర్ కుటుంబం  
చిప్పగిరి : మండల పరిధిలోని నేమకల్‌ గ్రామంలో మంగళవారం వైయ‌స్ఆర్ కుటుంబం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు గ్రామ బూత్‌కమిటీ సభ్యులు సుంకన్న, గురుదాసు, నెట్టెకంటి, గోవిందరాజులు ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి వైఎస్సార్‌ సభ్యత్వం ఇచ్చి కుటుంబ సభ్యులుగా చేర్పించారు. అనంతరం 9121091210 ఫోన్‌కాల్‌కు మిస్డ్‌కాల్‌ ఇచ్చి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో సందేశాన్ని వినిపించారు. వైయ‌స్ఆర్ కుటుంబం సభ్యత్వం నమోదు చేసుకున్న కుటుంబాల ఇళ్లకు వైయ‌స్ఆర్ కుటుంబం స్టిక్కర్‌లను అతికించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసమే వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాల పథకాలను ప్రవేశపెట్టాడని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
 ----------------------------
ఉత్సాహంగా వైయ‌స్‌ఆర్‌ కుటుంబం 
ఎమ్మిగనూరు:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పిలుపు మేర‌కు మండ‌లంలో వైయ‌స్ఆర్ కుటుంబం కార్య‌క్ర‌మం ఉత్సాహంగా సాగుతోంది. మండల పరిధిలోని కె.తిమ్మాపురం, టీఎస్‌ కూళ్ళూరు గ్రామాల్లో మంగళవారం వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నవరత్నాలపై నాయకులు ఇంటింటికి తిరుగుతు వాటి ఆవశ్యకతను వివరించారు. ఈ సందర్బంగా ఆయా గ్రామాల వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్‌ బక్కమాదన్న, కురవ బడేసాబ్, వెంకట్రాముడు, బజారి, ముక్కపంటి రాముడు, సత్యన్న, దస్తగిరి, బడేసాబ్, హనుమంతులు మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేద ప్రజల సంక్షేమ కోసం నవరత్నాలు ప్రతి పేదవాడికి దరిచేరే పథకాలని చెప్పారు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని చెప్పారు. బాబు వస్తే జాబు వస్తుందని, ఇంటికొక ఉద్యోగమంటు గద్దెనెక్కి నిరుద్యోగులను, ప్రజలను మోసం చేశాడని తెలిపారు. ప్రజలను మభ్య పెట్టేందుకు ఇంటింటికి తిరుగుతుందని వారి మాటలు ప్రజల నమ్మె పరిస్థితిలో లేరని చెప్పారు. వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖమంత్రి అయి ప్రజలకు మంచి పాలన అందిస్తాడని, ప్రజలు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి అండగా ఉండాలని, ప్రతి ఒక్కరికి నుంచి 9121091210 నెంబర్‌కు మిస్డ్‌ కాల్‌ ఇస్తే చాలని వైఎస్‌ఆర్‌ కుటుంబ సభ్యులుగా చేరిపోతారని తెలిపారు.ఈ కార్యక్రమంలో కె.తిమ్మాపురం చిన్నబొడేన్న, రామాంజనేయులు, చంద్రన్న, ఈశ్వరప్ప, టీఎస్‌ కూళ్ళూరులో నాగరాజు, వెంకటేష్, బోయ వెంకటేష్, దొడ్డప్ప, రామాంజనీ, మల్దకల్, పాండు, శ్రీనివాసులు, మాదవస్వామి, బోయ వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

తాజా వీడియోలు

Back to Top