వైయ‌స్ జగన్‌తోనే రాజన్న రాజ్యం

కోటవురట్ల

:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితోనే రాజ‌న్న రాజ్యం వ‌స్తుంద‌ని మాజీ ఎమ్మెల్సీ డీవీ సూర్య‌నారాయ‌ణ‌రాజు అన్నారు. మండ‌లంలో వైయ‌స్ఆర్ కుటుంబం కార్య‌క్ర‌మం శ‌నివారం నిర్వ‌హించారు.  మాజీ ఎమ్మెల్సీ డి.వి.సూర్యనారాయణరాజు, జడ్పీటీసీ వంతర వెంకటలక్ష్మి గ్రామాలలో పర్యటించి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. బూత్‌ కమిటీ సభ్యులు నవరత్నాలను ప్రజలకు వివరిస్తున్నారు.  వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌క‌టించిన న‌వ‌ర‌త్నాల‌తో పేద‌ల జీవితాల్లో వెలుగులు నింపుతాయ‌న్నారు. చంద్రబాబు మోసాలను మరిచిపోవద్దని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం వచ్చి మూడున్నరేళ్లు దాటుతున్నా ఏం చేశారని అడుగుతున్నారు. మరోసారి మోసపోకుండా విజ్ఞతతో మెలగాలని సూచిస్తున్నారు. రానున్న ఎన్నికలలో వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చేస్తేనే మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందని వివరిస్తున్నారు. మాటకు కట్టుబడే నాయకుడు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి అని ప్రజల కోసం పోరాడుతున్న ఏకైక నాయకుడని చెబుతున్నారు. మండలంలో కె.వెంకటాపురం, బి.కె.పల్లి, నీలిగుంట, పాములవాక, చినబొడ్డేపల్లి, ఆక్సాహేబుపేట, గొట్టివాడ, తంగేడు గ్రామాలలో కార్యక్రమాన్ని నిర్వహించారు. 

తాజా ఫోటోలు

Back to Top