జగనన్నను సీఎం చేద్దాం

పెనుకొండ: ప్రతి పేదోడి మొహంలో చిరునవ్వు చూడాలన్నదే దివంగత ముఖ్యమంత్రి డా. వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి కల. ఆయన కలను నిజం చేయాలని అహర్నిశలు కృషి చేస్తున్న వైయస్సార్‌ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేయడానికి ప్రతి ఒక్కరూ తోడుగా నిలవాలని వైయస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు  శంకరనారాయణ పిలుపునిచ్చారు. పట్టణంలోని కొత్తపేట, కమాన్‌వీధిలో మంగళవారం నిర్వహించిన వైయస్సార్‌ కుటుంబం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఇంటికీ వెళ్లి జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాలను వివరించారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన 600 వాగ్ధానాల్లో ఎన్ని హామీలు నెరవేర్చాడు, బూటకపు హామీలతో గద్దెనెక్కిన విషయాన్ని వివరించారు. నవరత్నాలతోనే ప్రతి పేదోడు అభివృద్ధి చెందుతాడని, వైయస్సార్‌సీపీని ఆదరించాలని కోరారు. ప్రతి ఇంటిలోనూ  వారి అభీష్టం మేరకు 9121091210కు ఫోన్‌ చేయించి వారితోనే జగన్‌ మాటలను సెల్‌ఫోన్‌ ద్వారా వినిపించారు. నవరత్నాలకు సంబంధించిన బ్రోచర్లను ఇంటి గోడలపై అంటించారు. కార్యక్రమంలో టౌన్‌ కన్వీనర్‌ ఏనుగల ఇలియాజ్, ఎంపీటీసీ ఉమర్‌ఫారూక్, మురళి, మాజీ మార్కెట్‌యార్డ్‌ చైర్మన్‌ నాగలూరుబాబు, బోయనరసింహ, బోయబాబు, తయూబ్, ఎంపీటీసీ అనితా శ్రీనివాసరెడ్డి, ప్రసాద్, కొండలరాయుడు, తదితర కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

తాడిపత్రిలో వైయస్‌ఆర్ కుటుంబం సభ్యత్వ నమోదు
తాడిపత్రి టౌన్‌: తాడిపత్రి పట్టణంలోని టైలర్స్‌కాలనీ, చిన్నబజార్, నందలపాడులో మంగళవారం వైయస్‌ఆర్ కుటుంబంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఇంటింటికి వెళ్లి దివంగత నేత పాలన ప్రవేశ పెట్టిన పథకాల అమలుపై ప్రజలకు తెలియచేశారు. అనంతరం యువనేత జగన్‌ ముఖ్యమంత్రి కాగానే చేపట్టనున్న సంక్షేమ పథకాలపై వివరించారు.. ఈకార్యక్రమంల్లో మైనారటీ విభాగ జిల్లా అధ్యక్షుడు మున్నా, , బాస్కర్‌రెడ్డి, నరసింహారెడ్డి, తేజారెడ్డి,భూపాల్, అల్లాబకాష్, షబీర్, రియాజ్, ఆఫ్రోజ్‌ ,జాకీర్, శ్రీనివాసులు, పాల్గొన్నారు.

Back to Top