కశీంపేటలో వైయస్‌ఆర్‌ కుటుంబం

విశాఖపట్నం: కశీంపేట మండలం జమాదులపాలెంలో వైయస్‌ఆర్‌ కుటుంబం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను వైయస్‌ఆర్‌ కుటుంబంలో భాగస్వామ్యులను చేశారు. అదే విధంగా కశీంపేట మండల పరిధిలోని అచ్యుతాపురంలో అమర్‌నాథ్‌ ఆధ్వర్యంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గొల్లపల్లి శ్రీనివాస్, జానకీరామరాజు, సూరిబాబు, కరక సోమినాయుడు, శ్రీధర్‌రాజు, భూలోక నాయుడు, జగన్, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Back to Top