జగనన్నబాటలో నడుద్దాం

రాజంపేట: 

రాష్ట్ర అభివృద్ధి  కోసం అహర్నిశలు కృషిచేస్తున్న వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాటలో నడుద్దామని  పార్టీ సీనియర్ నేత లచ్చయ్యగారి భాస్కర్‌రెడ్డి పిలుపునిచ్చారు.  మండలపరిధిలో మంగళవారం వైయ‌స్ఆర్ కుటుంబం కార్యక్రమం నిర్వహించారు. బూత్‌కన్వీనర్లు, కమిటీమెంబర్లు, కార్యకర్తలు పాల్గొని వైయ‌స్ జ‌గ‌న్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు వైయ‌స్ఆర్‌ కుటుంబంలో భాగస్వాములవుదామన్నారు. గ్రామీణస్థాయిలో ప్రజాసంక్షేమపథకాలు అమలుజరిగి ప్రజలు అభివృద్దిచెందాలంటే వైయ‌స్ జగన్‌తోనే సాధ్యమని అన్నారు. రాష్ట్రప్రజలను కళ్లబొల్లి మాటలతో మోసగిస్తున్న ఈ రాష్ట్రప్రభుత్వాన్ని నమ్మవద్దు అన్నారు. రాష్ట్రప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడుసంవత్సరాల్లో రాష్ట్రం వెనుకబడిపోయిందని అన్నారు. మండలపరిధిలోని ఆకేపాడు పెద్దూరు హరిజనవాడలో మంగళవారం నిర్వహించిన వైయ‌స్ఆర్ కుటుంబం కార్యక్రమంలో భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ మనమందరం జగనన్న ఆశయాలకు అనుగుణంగా నిలుద్దామన్నారు.  కార్యక్రమంలో సర్పంచ్‌ బొమ్మవరం గంగయ్య, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పి. భాస్కర్‌రాజు, వై.భాస్కర్, సిద్దయ్య, కూటాల్‌రెడ్డి, కమాల్‌సాహెబ్, ఉమ్మరిల్లు భాష తదితరులు పాల్గొన్నారు. 

Back to Top