ఇంటింటా "వైయస్ఆర్ కుటుంబం"

మెంటాడ:మండలంలోని కొండలింగాలవలస గ్రామంలో వైయస్సార్ సీపీ మండల ఉపాధ్యక్షులు ఎస్. తిరుపతిరావు, సర్పంచ్, వైయస్సార్ సీపీ మండల మహిళా అధ్యక్షురాలు ఎస్. నాగమణి, ఎంపీటీసీ సభ్యులు చింత కాశీనాయుడు ఆధ్వర్యంలో ఇంటింటా వైయస్సార్ కుటుంబం కార్యక్రమాన్ని నిర్వహించారు. గడపగడపకు వెళ్లి వైయస్ జగన్మోహనరెడ్డి ప్రకటించిన నవరత్నాలపై ప్రజలకు వివరించారు. జగనన్న ముఖ్యమంత్రి అయితే అందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని వారు వివరించారు. రాజన్న రాజ్యం జగనన్నతో సాధ్యమని ప్రజలకు వివరిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారం కోసం 600 హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేశాడని ఈ విషయం ప్రతీ ఒక్కరూ తెలుసుకొని వచ్చే ఎన్నికలో చంద్రబాబుకు ఓటుతో బుద్ధి చెప్పాలని కార్యకర్తలు, బూత్ కమిటీ కన్వీనర్లు, సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ సీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

....................................
కొత్తమరువాడలో వైయస్సార్ కుటుంబం
వంగర: మండల పరిధి కొత్తమరువాడ గ్రామంలో వైయస్సార్ కుటుంబం కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ ప్రతినిధి గాడి మధుసూధనరావు ఆధ్వర్యంలో గ్రామంలో పర్యటించి 40 కుటుంబాలను కలుసుకొని 9121091210కు మిస్డ్ కాల్ ఇచ్చి వైయస్సార్ కుటుంబంలో చేర్పించారు. నవరత్నాల పథకాలుపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సింగిరెడ్డి సింహాచలం, సింగిరెడ్డి ఆదినాయుడు, పైడిరాజు తదితరులు పాల్గొన్నారు.
.....................................................
మత్స్యకారుల్లో వైయస్సార్ కుటుంబానికి అపూర్వ ఆదరణ
గార: మండలంలోని మత్స్యకారులు వైయస్సార్ కుటుంబంలో చేరేందుకు ఉత్సాహం కనబరుస్తున్నారు.  బందరువానిపేటలోని స్ధానిక వైయస్సార్సీపీ నాయకుడు గుంటు లక్ష్ముయ్య ఆధ్వర్యంలో వైయస్సార్ కుటుంబం నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్ జగన్మోహనరెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాల వివరాలను వెల్లడించారు. కుటుంబంలో చేరిన తర్వాత వైయస్ జగన్మోహనరెడ్డి వాయిస్ కాల్ ద్వారా మాట్లాడటం చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. గ్రామంలోని యువకులు ఇంటింటీకీ వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు. అధేవిదంగా 24 పంచాయితీల్లోని 69 బూత్ కమీటీల పరిధిలో ముమ్మురంగా వైయస్సార్ కటుంబంలో చేరుతున్నారు. ఈ కార్యక్రమంలో గనగళ్ల రామారావు, కొమర నర్సింహమూర్తి, పుక్కళ్ల లక్ష్ముయ్య, పుక్కళ్ల శ్రీరాములు, పప్పు లక్ష్మణరావు, గనగళ్ల అప్పారావు, కన్వీనర్ మైలపల్లి ప్రకాష్, దుమ్ము సందెయ్య తదితరులు పాల్గోన్నారు.


Back to Top