రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యం

తూర్పుగోదావరి)) పి.గన్నవరం నియోజకవర్గ కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు కె.ఏనుగుపల్లి గ్రామం లో గడప గడపకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా గ్రామ సమస్యలను ప్రజలు కొండేటి దృష్టికి తీసుకొచ్చారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేదు, పక్కా ఇళ్లు మంజూరు చేయలేదు. రోడ్లు, డ్రైనేజీలు అధ్వాన్నంగా ఉన్నాయని గ్రామస్తులు వాపోయారు. హామీలు నెరవేర్చని బాబుకు తగిన గుణపాఠం చెబుతామని వారు అన్నారు. మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి స్వర్ణయుగం లాంటి పాలన వైయస్ జగన్ కే సాధ్యమని వైయస్సార్సీపీ సీజీసీ సభ్యుడు  చిట్టబ్బాయి, రాష్ట్ర కార్యదర్శి మోహన్, కోఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు అన్నారు. 

ప్రత్తిపాడు))లంపకలోవ గ్రామంలోజరిగిన గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో ప్రత్తిపాడు నియోజకవర్గ కో ఆర్డినేటర్ పర్వత పూర్ణ చంద్రప్రసాద్ పాల్గొన్నారు. బాబు మోసాలను గడపగడపలో ఎండగట్టారు. బాబు నిజస్వరూపం తెలుసుకోవాలని, అబద్ధపు హామీలతో బాబు మోసం చేశారని ప్రజలకు వివరించారు. త్వరలోనే రాజన్న రాజ్యం రాబోతుందని, వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేసుకొని జీవితాలను బాగుపర్చుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు.

తాజా ఫోటోలు

Back to Top