పేదల కష్టాలు తీరాలంటే వైయస్ జగన్ సీఎం కావాలి

కర్నూల్ జిల్లా బనగానపల్లె నియోజకవర్గం కొలిమిగుండ్ల మండల కేంద్రంలో వైయస్సార్సీపీ నియోజకవర్గ ఇంచార్జ్ కాటసాని రామిరెడ్డి గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రతి గ్రామానికి, ప్రతి గడప కు వెళ్లి ప్రజా బ్యాలట్ ను అందించి బాబు మోసపూరిత పాలనపై ప్రజాతీర్పు కోరారు. అనంతరం కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ... తమ పార్టీ కార్యకర్తల మీద కక్షసాధింపు చర్యలకు దిగడం మానుకోవాలని టీడీపీ నేతలను హెచ్చరించారు. రాబోయే రోజులు తమవే అని అప్పుడు వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలని సూచించారు. 

నియోజకవర్గంలో అన్ని విధాల అభివృద్ధి తన హయంలోనే జరిగిందని రామిరెడ్డి తెలిపారు.  మోడల్ స్కూల్ ,శ్మశాన వాటికకు శశ్వత పరిష్కారం ,సిసి రోడ్స్ తో పాటు మండలానికి మంచి నీటి పరిష్కారం కోసం రూ.18 కోట్ల రూపాయలతో అవుకు రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకు రావడానికి నిధులు మంజూరు చేయించడం జరిగిందని చెప్పారు. తెలుగుదేశం పార్టీ  అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ ఒక్క ప్రభుత్వ ఇళ్లు కూడా మంజరు కాలేదని దుయ్యబట్టారు. తన హయాంలో వేల ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని, 12 వేల ఎకరాలు పేదలకు పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు. అయితే పేద ప్రజల కష్టాలు తీరాలంటే ఒక్క జగన్ మోహన్ రెడ్డితోనే సాధ్యం అని, కాబట్టి వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు
 
Back to Top