పచ్చనేతలు పచ్చి మోసగాళ్లు

తూర్పుగోదావరి(పి.గన్నవరం))అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తాం, నిరుద్యోగ భృతి ఇస్తాం. రుణాలన్నీ మాఫీ చేస్తామంటూ మాయమాటలతో నమ్మబలికి ఓట్లు వేయించుకున్న టీడీపీ నేతలు గద్దెనెక్కాక మొండి చేయి చూపించారని అయినవిల్లి లంక ప్రజలు మండిపడ్డారు. తూ.గో.జిల్లా, పి.గన్నవరం నియోజకవర్గం, అయినవిల్లి మండలం, అయినవిల్లిలంక గ్రామంలో  వైయస్సార్సీపీ కో-ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో గడప గడపకు వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం కొనసాగింది. ధనార్జనే ధ్యేయంగా టీడీపీ పాలన సాగుతోందని చిట్టిబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు.


Back to Top