పేదల రక్తాన్ని పీల్చుతున్న నీచ ముఖ్యమంత్రి

దాహార్తి తీరే మార్గ‌మేది?
కైక‌లూరు:  రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయ‌ని చినుకుప‌డితే న‌డిచే ప‌రిస్థితి లేద‌ని కానుకొల్లు గ్రామ‌స్ధులు వైయ‌స్సార్ సీపీ జిల్లా అధ్య‌క్షుడు కొలుసు పార్థ‌సార‌ధి, నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త దూలం నాగేశ్వ‌ర‌రావు(డీఎన్నార్‌) ఎదుట వాపోయారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా వారు కానుకొల్లు గ్రామంలో ప‌ర్య‌టించి, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం వంద ప్ర‌శ్న‌ల‌తో కూడిన ప్ర‌జాబ్యాలెట్‌ను అంద‌జేసి చంద్ర‌బాబు మోస‌పూరిత పాల‌న‌పై వారు మార్కులు వేయించారు. అనంత‌రం మాట్లాడుతూ... చంద్రబాబు మోస‌పూరిత పాల‌న‌కు కాలం ద‌గ్గ‌ర‌ప‌డింద‌న్నారు. 

పేద‌ల‌పై చంద్ర‌బాబు దండ‌యాత్ర‌
న‌ర‌స‌న్న‌పేట‌(పోలాకి):  రాష్ట్రంలో పేద‌, బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల‌పై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు దండ‌యాత్ర ప్ర‌క‌టించిన‌ట్లు ఉంద‌ని వైయ‌స్సార్‌సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు ధ‌ర్మాన కృష్ణ‌దాస్ విమ‌ర్శించారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా మండ‌ల ప‌రిధిలోని బెల‌మ‌ర‌, పాల‌వ‌ల‌స‌, చిన్న‌కోడూరు, కిల్లిబుచ్చెన్న‌పేట గ్రామాల్లో ప‌ర్య‌టించి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ... పేద‌ల ప్ర‌జ‌ల ర‌క్తాన్ని పీల్చుతున్న నీచుడు చంద్ర‌బాబు అని ఆయ‌న మండిప‌డ్డారు. ఎన్నిక‌లకు ముందు అమ‌లుకు సాధ్యం కానీ హామీల‌నిచ్చి ఎన్నిక‌ల అనంత‌రం ఓట్లు వేసి గెలిపించిన ప్ర‌జ‌ల‌ను మ‌ర‌చిపోయిన నీచుడు చంద్ర‌బాబు నాయుడ‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Back to Top