టీడీపీ సర్కార్ పై మహిళల ఆగ్రహం

అనంతపురంః రాయదుర్గం సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మండలంలోని చదం గ్రామంలో నేడు గడప గడపకు వైయస్సార్‌ కార్యక్రమం నిర్వహించారు.  ఉదయం 11  గంటలకు కార్యక్రమం ప్రారంభమై మద్యాహ్నం 3  గంటల వరకు జరిగింది. ఈ కార్యక్రమంలో 200  గడపలు తిరిగారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు , అమలు చేయకుండా మోసగించిన తీరును కాపు రామచంద్రారెడ్డి  ప్రజలకు వివరించి,వంద ప్రశ్నలతో కూడిన ప్రశ్నాపత్రాన్ని అందించారు. రైతురుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని, మా ఇంటికి మహాలక్ష్మి పేరుతో బ్యాంకుల్లో డబ్బు జమ చేస్తామని, మహిళలకు సెల్‌ ఫోన్లు ఇస్తామని చెప్పిన ఒక్క వాగ్దానాన్ని కూడా పూర్తిస్థాయిలో  నెరవేర్చలేదని మహిళలు లక్ష్మిదేవి, సరసమ్మ, హనుమక్క, తలారి వన్నూరమ్మ, మహాలక్ష్మి తదితరులు టీడీపీ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

హాజరైన నాయకులు:  రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి గౌని ఉపేంద్రరెడ్డి,   బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి ఎన్టీ సిద్దప్ప,   ఎస్సీ  సెల్‌ రాష్ట్రకార్యదర్శి బీటీపీ గోవిందు ,జిల్లా ప్రధాన కార్యదర్శి మాధవరెడ్డి, ఎంపీపీ భారతి,   పాటిల్‌ సదాశివారెడ్డి, రాయదుర్గం మండల కన్వీనర్‌ మల్లికార్జున, మండల ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, ఎంపీటీసీలు లక్ష్మిదేవి, సురేష్, భీమన్న, సర్పంచులు య్రరప్ప, కిష్టప్ప యాదవ్,  బేలోడు రామాంజినేయులు,  తదితర 110 మంది హాజరయ్యారు.
Back to Top