సోమిరెడ్డిని వదిలే ప్రసక్తే లేదు

ముత్తుకూరు: 

పదవిని, ప్రజలను అడ్డం పెట్టుకొని రూ.వెయ్యికోట్లు అక్రమంగా ఆర్జించి, విదేశాల్లో దాచిపెట్టుకొన్న ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి స్పష్టం చేశారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పాటూరువారికండ్రిగలో ‘గడప గడపకు వైయస్సార్‌’ కార్యక్రమంలో మంగళవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సోమిరెడ్డి అక్రమార్జనకు సంబంధించి తాము రుజువులు బయటపెడితే.. 24 గంటల్లో అవినీతిని రుజువు చేయాలని ఆయన బదులివ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

తాను చేసిన విమర్శలకు కట్టుబడి ఉన్నానని, తన వద్ద 100 శాతం రుజువులున్నాయని.. సోమిరెడ్డే 24 గంటల్లో తన నిజాయితీని రుజువు చేసుకోవాలని కాకాణి సవాలు విసిరారు. సోమిరెడ్డి అక్రమార్జనకు చెందిన రుజువులను అన్ని దర్యాప్తు సంస్థలకు అందచేస్తానన్నారు. అవి అసలో, నకిలీవో పోలీసుల వద్ద తేల్చుకుందాం రమ్మంటూ సవాల్ చేశారు.  రక్షించాలంటూ సోమిరెడ్డి కేంద్రమంత్రుల చుట్టూ తిరుగుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

Back to Top