విస్తృతంగా వైయ‌స్ఆర్‌ కుటుంబం

జగ్గయ్యపేట: రాష్ట్రంలో అట్టడుగు, నిరుపేదలకు సైతం సంక్షేమ పథకాలను అందించాలనే ధ్యేయంతో వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డి నవరత్నాల వంటి పథకాలను ప్రకటించారని  పార్టీకి చెందిన పలువురు బూత్‌ కన్వీనర్లు పేర్కొన్నారు. వైయ‌స్ఆర్‌  కుటుంబం కార్యక్రమంలో భాగంగా మంగళవారం పట్టణంలోని పలు వార్డులలోని పోలింగ్‌ బూత్‌లలో కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా బూత్‌ కమిటీల సభ్యులు,నాయకులు గృహాలను సందర్శిస్తూ యజమానులను కలుసుకున్నారు. ప్రస్తుత చంద్రబాబు పాలనలో ఆయన ఇచ్చిన హామీలు ఎలా అమలవుతున్నాయో వారిని అడిగి తెలుసుకున్నారు.అలాగే గతంలో వైఎస్సార్‌ పాలనలో ఆయన ఇచ్చిన హామీలను,సంక్షేమ పథకాలను ఎలా అమలు చేశారో వారికి గుర్తుచేశారు.39,46 వ బూత్‌ల కన్వీనర్లు పసుపులేటి లక్ష్మణరావు(చంటి మేస్త్రి),గవిని రమేష్‌ మాట్లాడుతూ ఓట్ల కోసం ఎడాపెడా హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా డ్వాక్రా మహిళలు,రైతులను మోసం చేసిన చంద్రబాబు నిజస్వరూపాన్ని ప్రజలు తెలుసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా నవరత్నాలపై అవగాహన కల్పిస్తూ వారిని వైఎస్సార్‌ కుటుంబంలో చేరాలని కోరారు. కార్యక్రమంలో 39,46 వ బూత్‌లలో కమిటీ సభ్యులు కుందవరపు సుబ్బారావు,షేక్‌ ఖాదర్‌బాయి,పఠాన్‌ సైదా,కాశి,గోపయ్య,గవిని సిద్దూ,సుంకర వెంకటేశ్వరరావు, ఏఎస్‌.మూర్తి,నాగేశ్వరరావు,51 వ బూత్‌లో మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ ముత్యాల చలం,పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి తుమ్మల ప్రభాకర్,కమిటీ సభ్యులు ముత్యాల నాగరాజు,జమ్మి పుల్లయ్య,చిన్ని కృష్ణ,34 వ బూత్‌లో కన్వీనర్‌ కలవారి నాగేశ్వరరావు,బొల్లా శ్రీనివాసరావు,తూములూరి హరి,సుబాని పాల్గొన్నారు.
........................................
‘వైయ‌స్ఆర్‌ కుటుంబం’లో చేరండి
కూచిపూడి: రాష్ట్రంలో దుష్ట పరిపాలన అంతానికి అందరూ వైయ‌స్ఆర్‌ కుటుంబంతో మమేకమై పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌కు బాసటగా నిలవాలని వైయ‌స్ఆర్‌సీపీ  అమృతలూరు మండల కన్వీనర్‌ యలవర్తి రామ్మోహనరావు పిలుపునిచ్చారు. మంగళవారం కూచిపూడి, మూల్పూరు, అమృతలూరు గ్రామాల్లోని పలు బూత్‌లలో నవరత్నాలు పథకాలపై ప్రచారం చేశారు. కార్యక్రమంలో పార్టీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యలవర్తి నాగభూషణం, బూత్‌ కమిటీ కన్వీనర్లు పాల్గొన్నారు. 
-----------------------
 రాష్ట్రంలో రాక్షస పాలన 
– వైయ‌స్ఆర్‌ కుటుంబం కార్యక్రమంలో ఉదయభాను
జగ్గయ్యపేట : రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుంద‌ని, టీడీపీ ప్ర‌భుత్వానికి ఇక నూకలు చెల్లిపోయే సమయం ఆసన్నమైందని  వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని ఉదయభాను పేర్కొన్నారు. గడప గడపకు వైయ‌స్ఆర్‌ కుటుంబం కార్యక్రమంలో భాగంగా మంగళవారం పట్టణంలో 39 వ పోలింగ్‌ బూత్‌ నిర్వహించిన కార్యక్రమంలో ఆయా బూత్‌ కమిటీ సభ్యులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ అధినేత వైయ‌స్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాలను కుటుంబ యజమానులకు వివరించారు. ఆయన మాట్లాడుతూ అభివృద్దిని ప్రక్కన పెట్టి,అధికారాన్ని అడ్డుపెట్టుకొని కోట్లాది రూపాయాలను ముఖ్యమంత్రి, అధికార పార్టీ నాయకులు దండుకుంటున్నారని ఆరోపించారు. పరిశ్రమల పేరుతో రైతులను మోసం చే స్తూ అన్నాయం చేస్తున్నారని,పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చిన సీఎం మద్దతు ధరకు మంగళం పాడారని తెలిపారు.డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పటి వరకు చేసిన దాఖలాలు లేవన్నారు.అదేవిధంగా నిరుద్యోగ యువతీయువకులకు ఇంటికొక ఉద్యోగం ఇస్తామని,ఉద్యోగం లేనివారికి నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల్లో అసత్య హామీలు ఇచ్చి గద్దెనెక్కి ఇప్పటికి మూడేళ్ల పాలనలో వారికి చేసింది శూన్యం అన్నారు.నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే అధికారంలోకి రావటానికి కారణమైన ప్రజలకు చేసిన వాగ్దానాలను, హామీలను అమలు పరచాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ మహ్మద్‌ అక్భర్, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ తన్నీరు నాగేశ్వరరావు,పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇంటూరి చిన్నా, నాయకులు నంబూరి రవి,శేషం ప్రసాద్,కుందవరపు సుబ్బారావు,పసుపులేటి లక్ష్మణరావు,పగిడిపల్లి సునిల్‌కుమార్,కాశి,గోపయ్య పాల్గొన్నారు.
––––––––––––– 
వైయ‌స్ఆర్‌ కుటుంబానికి విశేష స్పందన 
 అమృతలూరు: వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రారంభించిన వైయ‌స్ఆర్ కుటుంబం కార్య‌క్ర‌మానికి విశేష స్పంద‌న ల‌భిస్తోంద‌ని పార్టీ చుండూరు మండల కన్వీనర్‌ గాదె శివరామకృష్ణారెడ్డి, ఎంపీపీ వుయ్యూరు అప్పిరెడ్డి తెలిపారు. చుండూరు మండలంలోని యడ్లపల్లి, వలివేరు, మోదుకూరు, మండూరు, మున్నంగివారిపాలెం, తొట్టెంపూడి, చినపరిమి, చినగాదెలవర్రు తదితర గ్రామాల్లో వైయ‌స్ఆర్‌ కుటుంబం కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి నవరత్నాల పథకాలపై అవగాహన కల్పించారు. కుటుంబీకులను సెల్‌ఫోన్‌ ద్వారా మిస్డ్‌ కాల్‌ ఇచ్చి వైఎస్సార్‌ కుటుంబ సభ్యులుగా నమోదు చేశారు. కార్యక్రమంలో పార్టీ బూత్‌ కమిటీ కన్వీనర్లు, సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 
--------------------------------

నిరుపేదల అభ్యున్నతికే నవరత్నాలు 
నందివాడ‌: నిరుపేదలు, మధ్యతరగతి ప్రజల అభ్యున్నతి కోసమే వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాలు తీసుకువస్తున్నట్లు పార్టీ మండల కన్వీనర్‌ పెయ్యల ఆదాం తెలిపారు. మంగళవారం మండలంలోని తుమ్మలపల్లి, వెన్ననపూడి, విరివాడ గ్రామాల్లో నవరత్నాలపై ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదాం మాట్లాడుతూ దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హ‌యాంలో అమలు చేసిన పథ‌కాలతో పాటు మరికొన్ని పధకాలను చేర్చి రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజానీకానికి వైయ‌స్ జగన్‌ అందించడం తథ‌మన్నారు. బూత్‌కమిటీ సభ్యులంతా నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు అధిక సంఖ్యలో సభ్యత్వాలను నమోదు చేయాలన్నారు. 
---------------------------
త్వ‌ర‌లోనే రాజ‌న్న రాజ్యం
సత్తెనపల్లి:  దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పాల‌న మ‌ళ్లీ రాబోతుంద‌ని, రాజన్న పాలన కోసం వైయ‌స్ జగనన్నకు మద్దతుగా నిలిచి వైయ‌స్ఆర్‌ కుటుంబంలో భాగ స్వాములు కావాలని వైయ‌స్ఆర్‌సీపీ నేత, గజ్జల వైద్యశాల డాక్టర్‌ గజ్జల నాగభూషణ్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఇంటింటికి వైయ‌స్ఆర్‌ కుటుంబం కార్యక్రమంలో భాగంగా మంగళవారం బూత్‌ కమిటి కన్వీనర్లు, సభ్యులతో కలిసి పట్టణంలోని 8వ వార్డులో 59, 62 బూత్‌లలో ఇంటింటా ప‌ర్య‌టించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ప్లీనరీలో ప్రకటించిన నవరత్నాలు ప్రతి కుటుంబానికి మేలు చేస్తాయన్నారు. గత ఎన్ని కల్లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలన్ని అమలులో బూటకంగా మార్చార న్నారు. టీడీపీ దుర్మార్గ పాలన తీరును ఆయన వివరించారు. అనంతరం వారి సమస్య లను అడిగి తెలుసుకున్నారు. వైయ‌స్ఆర్‌ కుటుంబంలో వారిని భాగస్వాములను చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ చల్లంచర్ల సాంబశివరావు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మదమంచి రాంబాబు, జిల్లా కార్యదర్శి గార్లపాటి ప్రభాకర్, 9వ వార్డు కౌన్సిలర్, మున్సిపల్‌ చీఫ్‌ విప్‌ బలిజేపల్లి సురేష్‌కుమార్, బూత్‌ కన్వీనర్లు బంకా మధుబాబు, వంజా సుధీర్‌కుమార్, కొత్తపల్లి రాజు, పసల పవన్‌కుమార్, తుమృకోట ప్రసాద్, కంచర్ల మత్తయ్య, వెదుళ్ళపల్లి సుధాకర్, గొట్టిముక్కల అనుదిప్, సందెపోగు సంతోష్, మీసాల అనీల్, తదితరులు పాల్గొన్నారు. అలాగే పట్టణంలోని వివిధ వార్డుల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వివిధ విభాగాల నాయకులు, కార్యకర్తలు బూత్‌ కమిటీ కన్వీనర్లు, సభ్యులతో కలిసి ఇంటింటికి తిరిగారు.


తాజా వీడియోలు

Back to Top