బలవంతపు భూసేకరణపై ఆగ్రహం

తూర్పుగోదావరిః 216 జాతీయ రహదారి విస్తరణ  కోసమని చెప్పి ప్రభుత్వం రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటోందని వైయస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు మండిపడ్డారు. గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమంలో భాగంగా కన్నబాబు సర్పవరం ప్రాంతంలో పర్యటించారు. ప్రభుత్వం నిర్వాకం వల్ల వందలాది మంది రైతులు అన్యాయమైపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. బుక్ వాల్యూ ప్రకారం రెండున్నర రెట్లు ఇవ్వాలని చట్టం చెబుతున్నా కూడా ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు . సర్పవరం ప్రాంతంలో ఎకరం రూ.కోటి పైన నడుస్తుంటే 9లక్షలు ఇస్తామంటూ కాగితాలు చేతిలో పెట్టి, డబ్బులు ఇవ్వకుండా అధికారపార్టీ నేతలు భూమిని స్వాధీనం చేసుకునే పని చేస్తున్నారని మండిపడ్డారు. ఇదేం దారుణమని అడిగితే సమాధానం చెప్పే నాథుడే లేడన్నారు. కనీస పరిహారం ఇవ్వకుండా భూములు ఏవిధంగా స్వాధీనం చేసుకుంటారని బాధితులు అడుగుతున్నారని తెలిపారు. బాధితులకు వైయస్సార్సీపీ అన్ని విధాల అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం తక్షణమే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో  ఆందోళన తప్పదని హెచ్చరించారు.


Back to Top