డ్వాక్రా రుణ‌మాఫీ ఎక్క‌డ‌?


రాజ‌మహేంద్ర‌వ‌రం(పిడింగొయ్యి):  టీడీపీ అధికారంలోకి వ‌స్తే డ్వాక్రా, రైతుల‌కు రుణమాఫీ చేస్తాన‌న్న చంద్ర‌బాబు హామీ రెండున్న‌రేళ్లు గ‌డుస్తున్న మోక్షం ల‌భించ‌డం లేద‌ని వైయ‌స్సార్‌సీపీ నియోజ‌క‌వ‌ర్గ రూర‌ల్ కో-ఆర్డినేట‌ర్ ఆకుల వీర్రాజు అన్నారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న పిడింగొయ్యిలో ప‌ర్య‌టించి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం ఆయన మాట్లాడుతూ... చంద్ర‌బాబు ఆరాచ‌క పాల‌నకు కాలం తీర‌బోయే రోజు తొంద‌ర‌లోనే వ‌స్తుంద‌న్నారు. ఇప్ప‌టికైనా ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చాల‌ని ఆయన డిమాండ్ చేశారు. 
Back to Top