జాబెక్కడ బాబు

మాచనపల్లె (దువ్వూరు) : బాబు వస్తే జాబ్‌ వస్తది, లేకపోతే రూ. 2వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని ఇలా అనేక అబద్దపు హామీలు ఇచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడని, మాకు ఏవీ రాలేదని వైయస్సార్‌ కుటుంబం కార్యక్రమంలో మహిళలు అన్నారు. మండల పరిధిలోని మాచనపల్లె గ్రామంలో మంగళవారం వైయస్సార్‌సీపీ గ్రామ నాయకులు కాసాని సుదర్శన్‌రెడ్డి, వీరమోహన్‌ ఆధ్వర్యంలో వైయస్సార్‌ కుటుంబం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు గ్రామంలోని కుటుంబ యజమానులతో మాట్లాడి ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలను, వైఫల్యాలను వారికి వివరించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ.... డ్వాక్రా రుణ మాఫీ, బెల్టుషాపుల రద్దు , బాబు వస్తే జాబ్‌ వస్తదని, నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారని, అయితే ఏ ఒక్కటీ అమలు కాలేదని తెలిపారు. 100 కుటుంబాలు వైయస్సార్‌ కుటుంబంలో చేరాయి. దువ్వూరు క్రిస్టియన్‌ కాలనీలో బూత్‌ కమిటీ నాయకుడు జేష్ఠాది రఘు ఆధ్వర్యంలో 40 కుటుంబాలను వైయస్సార్‌ కుటుంబంలో చేర్చారు.

Back to Top