సంక్షేమ పథకాలు అమలేది..?

పిఠాపురం: రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు కుంటుపడిందని,  ప్రభుత్వం చేస్తున్న ప్రచారం ఒట్టి బూటకమని వైయస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పెండెం దొరబాబు మండిపడ్డారు. శుక్రవారం పట్టణంలోని 15వ వార్డులో ఆయన గడప గడపకూ వైయస్‌ఆర్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు పింఛన్లు మంజూరు కావడం లేదని, రేషన్‌ కార్డులు లేవని అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. మురుగుకాల్వల్లో నీరు క్రిందకు పోవడం లేదన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ అంతంతమాత్రంగానే ఉందని దోమలతో ఇబ్బందులు పడుతున్నట్టు తెలిపారు. కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయన్నారు. ఇళ్ల స్థలాలు మంజూరు చేయడం లేదని పలువురు దొరబాబు ఎదుట మొరపెట్టుకున్నారు.

 అనంతరం పెండెం దొరబాబు మాట్లాడుతూ..రైతు రుణమాఫీ, డాక్వా రుణ మాఫీ అంటూ ఎన్నికల సమయంలో చంద్రబాబు హామిలిచ్చి జనాన్ని మోసం చేసారన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీల వివరాలు ముద్రించిన కరపత్రాలను ప్రజలకు దొరబాబు పంపిణీ చేసారు. ప్రజల పడుతున్న ఇబ్బందులను ఆయన అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు ఎలా దుర్వినియోగం అవుతున్నాయో వివరించారు. ఈకార్యక్రమంలో కౌన్సిల్‌ పత్రిపక్షనేత గండేపల్లి బాబి, పట్ణణ పార్టీ అధ్యక్షుడు బొజ్జా రామయ్య, మండలపార్టీ అధ్యక్షుడు నడిగట్ల చింతలరావు, మాజీ కౌన్సిలర్లు వేణుం నారాయణరావు, పైల ధర్గాజీ, ముస్లీం మైనార్టీ నాయకులు ఖలీల్‌షా, మొహిద్దీన్, ఆలీ, జలాల్, జిలాన్, హర్షద్, క్రరి ప్రసాదు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. 
                                                                           

 
Back to Top