పేదలకు అందని సంక్షేమ పథకాలు

ప్రకాశంః అన్ని అర్హతలున్నా పింఛన్లు ఇవ్వడం లేదు. రుణాలు మాఫీ కాలేదు. మూడేళ్లలో ప్రభుత్వం ఒక్క ఇళ్లు కూడ మంజూరు చేయలేదంటూ రైతులు, పలువురు మహిళలు కొండేపి నియోజకవర్గ ఇంచార్జ్ వరికూటి అశోక్ బాబు ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. పొన్నలూరు మండలం చెరువు కొమ్ముపాలెం, పరుచూరిపాలెం తదితర గ్రామాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి అశోక్ బాబు గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరిగి బాబు మోసపూరిత విధానాలను ఎండగట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...బాబు పాలనలో పేదలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించి అన్ని వర్గాల ప్రజలను బాబు మోసం చేశాడని ధ్వజమెత్తారు. 


Back to Top