న్యాయ పోరాటం చేస్తాం

నెల్లూరుః  46వ డివిజన్‌లోని నక్కలోల్ల సెంటర్, బృందావనం ప్రాంతాల్లో ఆ డివిజన్‌ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి వేలూరు మహేష్‌ ఆధ్వర్యంలో గడపగడపకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు ఎమ్మెల్యే డా.పి. అనిల్‌కుమార్‌యాదవ్‌ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ...ఈ ప్రాంతంలో అనేకమంది పేదలు పూరిగుడిసెలు వేసుకుని నివసిస్తున్నారని, పక్కా గృహాలు మంజూరయ్యేలా చూడాలని కోరుతున్నారని తెలిపారు. టీడీపీ ఆర్భాటంగా జరుపుతున్న జన్మభూమి కార్యక్రమంలో ఒక్క కొత్త పింఛన్‌ కానీ, ఇల్లు కానీ మంజూరు చేస్తున్న దాఖలాలు లేవని ఎమ్మెల్యే మండిపడ్డారు. అయితే అధికార పార్టీ నాయకులు మాత్రం జన్మభూమి కార్యక్రమంలో ప్రజలకు అన్నీ చేస్తామంటూ మాయమాటలు చెప్పి  మభ్యపెడుతున్నారని ఫైర్ అయ్యారు.  నెల్లూరు నగరంలో పింఛన్ల కోసం 2300 మంది దరఖాస్తు చేసుకోగా ఇంకా సుమారు 3 వేల మంది దరఖాస్తులను అప్‌లోడ్‌ చేయకుండా పక్కన పడేశారని ఆరోపించారు.

 రేషన్‌ కార్డులు కూడా పూర్తిగా తప్పుల తడకగా ఉన్నాయన్నారు.  ఇవన్నీ సరిచేసి కనీసం నెల తర్వాత నిర్వహించే జన్మభూమి కార్యక్రమంలోనైనా ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. జన్మభూమి కార్యక్రమంలో పింఛన్ల పేరుతో వృద్ధులు, వితంతువులను తిప్పుకుంటున్నారని వారంతా పింఛన్లు రాక అల్లాడిపోతున్నారని పేర్కొన్నారు. బాధితులందర్నీ కలుపుకుని పెద్ద ఎత్తున న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు గోగుల నాగరాజు, ఎండీ. ఖలీల్‌ అహ్మద్, ఓబిలి రవిచంద్ర, డాక్టర్‌ కొండారెడ్డి, వేలూరు రఘు, బాలు, కృష్ణ, కుమార్, రాము, దార్ల వెంకటేశ్వర్లు, శివరపురం సురేష్, శంకర, రాజేంద్ర, నాగరాజు, మునీర్‌ సిద్దిక్‌ రత్నం, కోటా శ్రీనివాసులు, బాలయ్య, కారంపూడి సుబ్రహ్మణ్యరెడ్డి, గంధం సుధీర్‌బాబు, ఎస్‌.కె.హాజీ, కాకు, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. 
Back to Top