ఎన్నిక‌ల హామీల‌పై పోరాటం చేద్దాం

విజ‌య‌న‌గ‌రం: టీడీపీ మోస‌పూరిత హామీల అమ‌లకై ప్ర‌జ‌లంతా తిరుగుబాటు చేయాల‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజ‌య‌న‌గ‌రం జిల్లా శృంగ‌వ‌ర‌పు కోట నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త నెక్క‌ల నాయుడుబాబు ధ్వ‌జ‌మెత్తారు. నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని వేప‌డ మండ‌లం గ‌ధ‌భావ‌ల‌స గ్రామంలో నాయుడు బాబు ఆధ్వ‌ర్యంలో గ‌డ‌ప గ‌డ‌ప‌కై వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు ఎన్నిక‌ల హామీల‌పై ముద్రించిన ప్ర‌జాబ్యాలెట్‌ను ఇంటింటికి పంచుతూ బాబు మోసాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు. కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు. 


Back to Top