వైయస్సార్సీపిని పటిష్టం చేస్తాం

పుంగనూరుః గ్రామీణ ప్రాంతాలలో వైయస్సార్సీపిని పూర్తి స్థాయిలో పటిష్టం చేసి, బలోపేతం చేస్తామని వైయస్సాఆర్సీపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , పుంగనూరు ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం పుంగనూరు మండలంలో వైయస్సాఆర్సీపి గడపగడపకు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని పత్తెమ్మగారిపల్లెకు చెందిన జి.రామక్రిష్ణ, నడివీధి క్రిష్ణప్ప, సోమశేఖర్, శ్రీనివాసులు, శంకరప్ప, గంగిరెడ్డి, రాజేష్, నరసింహులు , నాగరాజు, సుబ్బన్న ఆధ్వర్యంలో  30 మంది తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు , రైతులు, యువకులు పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి  ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పార్టీ కండువాలు కప్పి , పార్టీలోనికి చేర్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... పుంగనూరు వైయస్సాఆర్సీపి కంచుకోటగా ఉందన్నారు. కొన్ని గ్రామాల్లో కొంత మంది తెలుగుదేశం పార్టీలో ఉన్నారని , ఆ పార్టీ విధానాలతో విసిగివేశారిపోయి , పార్టీకి గుడ్‌బై చెబుతున్నారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో వైయస్సార్సీపి ఊహించని మెజార్టీ విజయం సాధించి, ముఖ్యమంత్రిగా వైయస్‌.జగన్మోహన్‌రెడ్డి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.   ఈ కార్యక్రమంలో జెడ్పి మాజీ ఉపాధ్యక్షుడు పెద్దిరెడ్డి,  పార్టీ రాష్ట్ర కార్యదర్శులు ఎన్‌.రెడ్డెప్ప, పోకల అశోక్‌కుమార్, ఎంపిపి నరసింహులు,  జెడ్పిటీసీ వెంకటరెడ్డి యాదవ్, వైస్‌ఎంపిపి రామచంద్రారెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఆవుల అమరేంద్ర, పార్టీ మండల అధ్యక్షుడు  చదళ్ల విజయభాస్కర్‌రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు , పార్టీ అభిమానులు  తదితరులు పాల్గొన్నారు.

Back to Top