బాబుకు ఓట్లు వేసి మోసపోయాం

-పేదల బతుకుల్లో మార్పు రావాలంటే జగనన్న రావాలి
- గడపగడపకూ వైయ‌స్ఆర్ సీపీ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే రోజ‌

చిత్తూరు జిల్లా(నగరి): ప‌్ర‌జ‌ల త‌ర‌పున పోరాడ‌ేందుకు వైయ‌స్ఆర్ సీపీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంద‌ని, హామీలు అమలు చేసేవరకు ప్రభుత్వంపై పోరాడుతూనే ఉంటామని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రజలకు భరోసా ఇచ్చారు. గడపగడపకూ వైయ‌స్ఆర్ సీపీ కార్యక్రమంలో భాగంగా విజయపురం మండలం కేవీపురం, బూచివానెత్తం, కాళికాపురం గ్రామాల్లో ఆమె పర్యటించారు. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 

ఇంటి పట్టాలు లేవని, బంగారంపై రుణాలు ఇవ్వడం లేదని, రైతు రుణమాఫీ జరగలేదని ప్ర‌జ‌లు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సిమెంటు రోడ్లు లేకపోవడంతో వర్షాలకు మట్టి రోడ్లు చిత్తడిగా మారుతున్నాయని గ్రామస్తులు వాపోయారు. కొత్తగా రేషన్‌ కార్డులు మంజూరు చేయడం లేదని పలువురు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో పేదలు మరింత కుంగిపోయారని అన్నారు. ఇలాంటి వారికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు.  ప్రజలు కష్టాలు పడుతుంటే సీఎం విదేశాలకు వెళ్లి వారికి సేవ చేసే పనిలో పడ్డారని మండిపడ్డారు. 

ఇచ్చిన హామీలు ఒకటైన సక్రమంగా నెరవేర్చారా అని ప్రశ్నించారు.  ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. పేదల బతుకుల్లో మార్పు రావాలంటే  జగనన్నరావాల‌న్నారు. కార్యక్రమంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు లక్ష్మీపతి రాజు, మండల అధ్యక్షుడు రామకృష్ణమ రాజు, రైతు నాయకుడు రవినాయుడు, ఎంపీటీసీ సభ్యుడు శివకుమార్, ఆనంద్, శేఖర్‌రెడ్డి, బెంజిమన్‌ తదితరులు పాల్గొన్నారు.

- గడప గడపకూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మంలో స‌మ‌స్య‌ల వెల్లువ‌
-మోసపూరిత బాబుపై మండిపడుతున్న ప్రజలు

 అనంతపురం జిల్లా) ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలకు ఆశపడి ఓట్లేశాం. ఆయన అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా వాటిని పట్టించుకోవడం లేదు. ఆయన్ను నమ్మినందుకు అందరినీ నట్టేట ముంచాడు’ అని నగరవాసులు చంద్రబాబు పాలన తీరుపై ధ్వజమెత్తారు.   వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ‘గడప గడపకూ వైయ‌స్ఆర్‌’ కార్యక్రమం  శ్రీనివాసనగర్‌లో నిర్వ‌హించారు. పార్టీ క్రమ శిక్షణ సంఘం సభ్యులు బి.ఎర్రిస్వామిరెడ్డి ఇంటింటికీ వెళ్లి బ్యాలెట్‌ పేపర్లు అందజేశారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన  హామీలు నెరవేర్చారా...లేదా? అంటూ ఆరా తీసారు.  లేదు అని ప్రజలు సమాధానమిచ్చారు. 


Back to Top