మాకొద్దు..ఈ అవినీతి ప్రభుత్వం

తూర్పుగోదావరి జిల్లా))బ్రోకర్లను పెట్టుకొని జన్మభూమి కార్యక్రమాలు చేస్తూ చంద్రబాబు రాజ్యాంగానికి తూట్లుపొడుస్తున్నారని వైయస్సార్సీపీ కోత్తపేట ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి మండిపడ్డారు. అనపర్తి నియోజకవర్గ కో ఆర్డినేటర్ డా. సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పాలమూరులో గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా జగ్గిరెడ్డి ముఖ్య అతిథిగా జగ్గిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...గ్రామగ్రామాన గడపగడపకు వైయస్సార్ కార్యక్రమానికి విశేష స్పందన వస్తోందని తెలిపారు. రోజురోజుకు వైయస్సార్సీపీకి ప్రజాధారణ పెరుగుతుందని చెప్పారు. 

 రెండున్నరేళ్లలో రైతు, డ్వాక్రా రుణమాఫీ, ఇళ్లు ఏ ఒక్కటీ నెరవేర్చిన పాపాన పోలేదని చంద్రబాబు సర్కార్ పైధ్వజమెత్తారు. ఈ అవినీతి ప్రభుత్వం మాకొద్దని ప్రజలే తమకు చెబుతున్నారని,   పిలవకుండానే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సూర్యనారాయణరెడ్డి వెంట నడుస్తున్నారని జగ్గిరెడ్డి పేర్కొన్నారు. ప్రజల్లో విప్లవం వస్తే ఏవిధంగా ఉంటుందనేదానికి ఇదో సంకేతమన్నారు. ఇప్పటికైనా బాబు బుద్ది తెచ్చుకొని ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. జన్మభూమిలో ఒక్క సమస్య కూడ పరిష్కారం కాలేదని, తూతూమంత్రంగా ముగించారని ఎద్దేవా చేశారు. జన్మభూమి కార్యక్రమాల్లో ప్రజలకు కావాల్సిన అవసరాలపై అడుగుతుంటే తమ గొంతు నొక్కారని జగ్గిరెడ్డి అన్నారు. రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. Back to Top