పనుల్లేక పస్తులుంటున్నాం

చిత్తూరు: ఉపాధి ప‌నులు వంద రోజులు పూర్తి అవ‌డంతో అధికారులు త‌మ‌కు ప‌నులు క‌ల్పించ‌డం లేద‌ని ఓబీఆర్ కండ్రిగ గ్రామ‌స్తులు వైయ‌స్సార్సీపీ ఎమ్మెల్యే రోజా ఎదుట ఆవేద‌న వ్య‌క్తం చేశారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఎమ్మెల్యే రోజా ఓబీఆర్‌కండ్రిగ గ్రామంలో ప‌ర్య‌టించి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. చంద్ర‌బాబు పాల‌న అత్యంత దుర్మార్గ‌మైన పాల‌న అని రోజా నిప్పులు చెరిగారు. బాబు పాల‌న‌లో ప్ర‌జ‌లకు క‌ష్టాలు త‌ప్ప‌డం లేద‌న్నారు. ప్ర‌జా సంక్షేమాన్ని విస్మ‌రించి కేవ‌లం అవినీతి, అక్ర‌మాల‌కే బాబు పెద్ద‌పీఠ వేస్తున్నార‌ని మండిప‌డ్డారు. 


Back to Top