కేసులతో భయపెట్టలేరు..మీ ఆగడాలను చూస్తూ ఊరుకోం

తూర్పుగోదావరి))వైయస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పిల్లి సుబాష్ చంద్రబోస్ రంపచోడవరం నియోజకవర్గంలో దిగ్విజయంగా గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమాన్ని ముగించారు. ఈ సందర్భంగా వైయస్సార్సీపీ నేతలు పెద్ద ఎత్తున ర్యాలీ తీశారు. 111 రోజుల పాటు నియోజకవర్గంలో ప్రతీ ఇంటికి వెళ్లి కార్యక్రమాన్ని పూర్తిచేసినందుకు పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు బోస్ కు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గడపగడపకు కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతోందని చెప్పారు.  ఎక్కడికెళ్లినా ప్రజలు ఒకటే మాట చెబుతున్నారని, టీడీపీకి ఓటేసి మోసపోయామని ఆవేదన చెందుతున్నారని కన్నబాబు అన్నారు. 

 పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ....ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు అమలు పర్చడం లేదని మండిపడ్డారు. రైతు, డ్వాక్రారుణాల మాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగభృతి ఏ ఒక్కటీ అమలు చేయలేదని ప్రజలకు అర్థమయ్యేవిధంగా గడపగడపకు వెళ్లి కరపత్రాలు అందించి వివరించామన్నారు. వైయస్సార్సీపీ నాయకులపై కేసులు పెడితే తమ పార్టీలోకి వస్తారని టీడీపీ కుయుక్తులు పన్నుతోందని, కేసులకు భయపడే పార్టీ వైయస్సార్సీపీ కాదన్న సంగతి తెలుసుకోవాలని చురక అంటించారు. అటువంటి ఆగడాలు కొనసాగిస్తే చూస్తూ ఊరుకునేది లేదని చంద్రబాబు సర్కార్ ను హెచ్చరించారు.  జన్మభూమి సభల్లో టీడీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు  నోటికి ఎది వస్తే అది మాట్లాడుతున్నాడని, దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని సూచించారు.  నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. 
Back to Top