మనమంతా వైయస్ఆర్ కుటుంబం

–శ్రీకూర్మం నుంచి శ్రీకారం చుట్టిన కార్యక్రమం
– ధర్మాన ప్రసాదరావు ఆధ్వర్యంలో ఆసక్తిగా చేరుతామంటున్న సభ్యులు

దువ్వుపేట(గార): నియోజకవర్గంలో వైయస్సార్‌ కుటుంబం– నవరత్నాలపై ప్రచార కార్యక్రమాన్ని శ్రీకూర్మం పంచాయితీ నుంచి శ్రీకారం చుట్టారు. వైయస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా శ్రీకూర్మనాధునికి ప్రత్యేక పూజలనంతరం పంచాయితీలోని దువ్వుపేట గ్రామంలో వైయస్సార్‌ కుటుంబం ప్రారంభమైంది. సర్పంచ్‌ బరాటం రామశేషు, బూత్‌ కన్వీనర్‌ దువ్వు అప్పన్నల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా వైయస్సార్‌ స్టిక్కర్‌ను కుటుంబ సభ్యులకు చూపించారు. వైయస్సార్‌ కుటుంబంలో చేరేందుకు సమ్మతిని అంగీకరిస్తూ 9121091210 నెంబరుకు సదరు కుటుంబ సభ్యునిచే మిస్డ్‌ కాల్‌ ఇప్పించారు, ఇలా ఇంటింటికి తొలి కార్యక్రమం ప్రారంభమైంది. నవరత్నాలు కరపత్రంతో పాటు చంద్రబాబు హమీల పత్రాలను అందించారు. ఈ సందర్భంగా మేమంతా వైయస్సార్‌ కుటుంబ సభ్యులుగా ఆనందంగా చేరుతామని పలువురు కుటుంబసభ్యులు ధర్మాన ప్రసాదరావు వద్ద తెలిపారు. కార్యక్రమంలో డీసీఎంఎస్‌ ఛైర్మన్‌ గొండు కృష్ణమూర్తి, చల్ల రవికుమార్, జెడ్పీ మాజీ ఉపాధ్యక్షలు మార్పు ధర్మారావు, బరాటం నాగేశ్వరరావు, మండల పార్టీ కన్వీనర్‌ పీస శ్రీహరిరావు, గొండు కృష్ణ, మైలపల్లి ఎర్రన్న, పీస గోపి, గుంటు లక్ష్ముయ్య, ఉదయభాస్కరరావు, అంబటి చినబాబు, యాళ్ల నారాయణ, శిమ్మ ధర్మరాజు, శీర ప్రభాకరరావు, స్ధానికులు ఎల్‌వీ ప్రసాద్, గొరుసు కృష్ణ, గురుగుబిల్లి ఎర్రయ్య, అంపోలు శ్రీనుబాబు, అందవరపు బాలకృష్ణ, దాలిరాజు తదితరులు పాల్గొన్నారు.

శిక్షకునిగా మారిన ధర్మాన....
తొలిరోజు ప్రారంభమైన వైయస్సార్‌ కుటుంబ కార్యక్రమంలో ధర్మాన ప్రసాదరావు తానే శిక్షకునిగా మారారు. ఈ కార్యక్రమానికి మండలంలోని 62 బూత్‌ కన్వీనర్‌లను కార్యక్రమానికి ఆహ్వానించారు, ముందుగా ఇంటి యజమాని అనుమతితో వెళ్లి కుటుంబ సభ్యులతో ఎలా మాట్లాడాలి.. ఎటువంటి ప్రశ్నలు వేయాలి..వైయస్సార్‌ హయాంలో పొందిన పథకాలు, చంద్రబాబు హామీలులో ఎన్ని అమలు చేసారు వంటివి అడిగి వైయస్సార్‌ కుటుంబంలో చేరాలనుకుంటున్నారా అని అడగడం వంటివి స్వయంగా ఆయనే కుటుంబ సభ్యులుతో ఎలా మాట్లాడాలో లైవ్‌లో చూపించారు. ఇలా మూడు కుటుంబాల వద్ద 40 నిమిషాలు వెచ్చించి శిక్షణతో పాటు కుటుంబ సభ్యులను చేర్పించారు.

Back to Top