ప్రతిఒక్కరం వైయస్ జగన్ వెంటే నడుస్తాం

రైల్వేకోడూరు అర్బన్‌: వైయస్సార్‌సీపీపార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అడుగుజాడల్లో ప్రతిఒక్కరం నడుస్తామని జడ్‌పీటీసీ మారెళ్ల రాజేశ్వరి, పట్టణకన్వీనర్‌ సీహెచ్‌ రమేష్, నియోజకవర్గ అధికార ప్రతినిధి మండల నాగేంద్ర, జిల్లా ప్రధానకార్యదర్శి యనమాల మహేష్‌లు పేర్కొన్నారు. పట్టణంలోని గాంధీనగర్, ఒంటెల సిద్దయ్యవీధి తదితర ప్రాంతాల్లో వైయస్సార్‌ కుటుంబం కార్యక్రమాన్ని నిర్వహించారు. నవరత్న పథకాలు ఎంతో ఆకర్షితంగా ప్రజల జీవన విధానాన్ని మార్చేవిధంగా ఉన్నాయని ప్రజలు స్వచ్ఛందంగా వైయస్సార్‌ కుటుంబంలో చేరుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు సుబ్రమణ్యం, వార్డుమెంబర్‌ సుదర్శన్‌రాజు, రమణ, యువరాజు, సుధాకర్, రత్నయ్య, గంగయ్య తదితరులు పాల్గొన్నారు.

Back to Top