మేమంతా మీవెంటే...!

గడప గడపకు వైయస్సార్‌లో నాయకులకు భరోసా ఇస్తున్న  ప్రజలు
పిఠాపురంః నమ్మి ఓట్లేసాం గద్దెనెక్కాకా నట్టేటముంచారు. ఇంక నమ్మేది లేదు మాబాగోగులు చూసేది వైయస్సార్‌సీపీ అధినేత వైయస్‌ జగన్మోహనరెడ్డి మాత్రమే అందుకే మేమంతా మీవెంటే ఉంటాం అంటు వైయస్సార్‌సీపీ నేతలకు ప్రజలు భరోసా ఇస్తున్నారు.  గడపగడపకు వైయస్సార్‌ కార్యక్రమంలో బాగంగా పట్టణ పార్టీ అధ్యక్షుడు బొజ్జా రామయ్య ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే పిఠాపురం నియోజకవర్గ వైయస్సార్‌సీపీ కోఆర్డినేటర్‌ పెండెం దొరబాబు, మున్సిపల్‌ కౌన్సిల్‌ ప్రతిపక్ష నేత గండేపల్లి బాబీ ఇతర నాయకులు కార్యకర్తలు మంగళవారం పట్టణంలొ 10వవార్డులో పర్యటించారు.  స్థానికులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరవు పెడుతున్నారు. ముఖ్యంగా వార్డుల్లో మౌళిక సదుపాయాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని నెగ్గిన నేతలు పట్టించుకోడం లేదని వాపోతున్నారు. అలాగే ప్రభుత్వ పథకాల పంపిణీలో అధికారపార్టీ నేతల తీరుదారుణంగా ఉందని దుయ్యబడుతున్నారు. కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మాత్రమే అన్నిఅందాలన్న తీరు సామాన్యులను నట్టేటముంచుతోందని ఏ పథకం అందక ఆర్ధిక ఇక్కట్లకు గురవుతున్నామని వాపోతున్నారు. ప్రతీ వార్డులోను కొందరే తమ పార్టీ వారు అనుకుంటే మిగిలిన వారందరు ఏమైపోవాలి అంటు అధికారపార్టీ నేతల తీరును వైయస్సార్‌సీపీ నేతల వద్ద ప్రజలు ఏకరవుపెడుతున్నారు. పట్టించుకోవాల్సిన అధికారపార్టీ నేతలు పట్టించుకోవడం లేదని మూడేళ్లయినా ఒక్క సమస్య తీర్చ లేదని కనీసం మావంక చూసిన పాపానపోవడం లేదంటు సమస్యలను ఏకరవుపెడుతున్నారు. ప్రజల సమస్యలను సావదానంగా వింటున్న వైయస్సార్‌సీపీ నేతలు అన్ని సమస్యల పరిష్కారానికి ప్రజల తరుపున పోరాటం చేస్తామని అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు. ఈకార్యక్రమంలో బొజ్జా అయ్యలు, వైయస్సార్‌సీపీ నేతలు క్రరి ప్రసాద్, క్రరి రాంబాబు, మైనార్టీ  నేత మొహీధ్దీన్, ఇజ్జాడ వెంకటేశ్వరరావు, నడిగట్ల చింతలరావు, బీ సాయిరామ్, బత్తిన ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు. 

చిరతపూడిలో గడపగడపకూ..
అంబాజీపేట : గడపగడపకూ వైయస్సార్‌ కార్యక్రమం అంబాజీపేట మండలం చిరతపూడి గ్రామంలో బుధవారం నిర్వహించనున్నట్టు వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వాసంశెట్టి చినబాబు తెలిపారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ కొండేటి చిట్టిబాబు, సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి, రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, మిండుగుదిటి మోహన్‌లు పాల్గొనున్నారన్నారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి గడపగడపకూ వైయస్సార్‌ కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు 
Back to Top