ఏ మొహం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్తారు బాబూ..?

  • ప్రజలంతా వైయస్‌ఆర్‌ కుటుంబంలో భాగస్వాములవ్వండి
  • టీడీపీ మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
  • విజయవాడ పశ్చిమ నియోజకవర్గ నవరత్నాల సభలో వెల్లంపల్లి
విజయవాడ: అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ఏ మొహం పెట్టుకుని ఇంటింటికీ ప్రచారంలో పాల్గొంటారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాస్‌ ప్రశ్నించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైయస్‌ఆర్‌ సీపీ నవరత్నాల సభను వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్టీ నేతలు మల్లాది విష్ణు, తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు పార్టీ నాయకులు, కార్యకర్తలకు నవరత్నాలౖ పథకాలు, వైయస్‌ఆర్‌ కుటుంబంపై అవగాహన కల్పించారు. అనంతరం వెల్లంపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ...9121091210 నెంబర్‌కు మిస్డ్‌కాల్‌ ఇచ్చి వైయస్‌ఆర్‌ కుటుంబంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజలందరినీ వైయస్‌ఆర్‌ కుటుంబంలో భాగస్వాములు చేయాలన్నారు. రైతులను, మహిళలను, విద్యార్థులను, యువతను మోసం చేసిన ఏకైక వ్యక్తి చంద్రబాబు అని, టీడీపీకి బుద్ధి చెప్పే విధంగా మోసాలను వివరిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ పాదయాత్ర వరకు వైయస్‌ఆర్‌ కుటుంబం కార్యక్రమం పూర్తవుతుందన్నారు. అనంతరం విజయవాడలో వైయస్‌ జగన్‌ బహిరంగ సభ ఉంటుందన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని సూచించారు. అనంతరం పార్టీ నేతలను కార్యకర్తలు ఘనంగా సత్కరించారు. 

తాజా ఫోటోలు

Back to Top