వైయ‌స్ఆర్ కుటుంబానికి అపూర్వ స్పంద‌న‌

తలుపుల:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పిలుపు మేర‌కు మండల పరిధిలోని పులిగుండ్లపల్లి, గెరికపల్లి, ఉబ్బరవాండ్లపల్లి తదితర గ్రామాల్లో పార్టీ నాయ‌కులు చేప‌ట్టిన వైయ‌స్ఆర్ కుటుంబం కార్య‌క్ర‌మానికి ప్ర‌జ‌ల నుంచి అపూర్వ స్పంద‌న ల‌భిస్తోంది. శుక్రవారం నియోజకవర్గ సమన్వయకర్త డా.పి.వి సిద్దారెడ్డి ఆధ‌ర్యంలో వైయ‌స్‌ఆర్‌ కుటుంబం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పార్టీ రాష్ట్ర కార్యదర్శి వజ్రబాస్కర్‌రెడ్డి, మండ‌ల కన్వీనర్‌ శంకర పర్యవేక్షించారు. వారు మాట్లాడుతూ గ్రామాల్లో వైయ‌స్‌ఆర్ కుటుంబ సభ్యులుగా చేరుటకు స్వచ్ఛందంగా ప్ర‌జ‌లు ముందుకు వ‌స్తున్నార‌న్నారు. నవరత్నాలాంటి ప‌థ‌కాలు ప్రజాసంక్షేమానికి ఉపయోగపడేవ‌న్నారు. కార్యక్రమంలో బూత్‌ కమిటీ కన్వీనర్‌లు చెన్నక్రిష్ణారెడ్డి, లోకనాథరెడ్డి, సుబ్బయ్య, యరమరెడ్డి, సుబ్బయ్య, సికిందర్‌ తదితరులు పాల్గొన్నారు 

తాజా ఫోటోలు

Back to Top