టీడీపీ పాలనపై సర్వత్రా అసంతృప్తి

నవరత్నాలతో పేదల్లో ఆనందం

నెల్లిపాక: వైయస్సార్‌ సీపీ నేత జగన్‌మోహనరెడ్డి ప్రకటించిన నవరత్నాలతో పేదల జీవితాల్లో ఆనందం నెలకొంటుందని పార్టీ మండల కన్వీనర్‌ తానికొండ వాసు అన్నారు. వైయస్సార్‌ కుటుంబంలో భాగంగా బుదవారం ఎటపాక,పిచుకలపాడు,కన్నాయిగూడెం పంచాయతీల్లో ఇంటింటికి నవరత్నాలను తీసుకెళ్లి ప్రజలకు వివరించారు. ఈసందర్భంగా పార్టీ పేదలకు అండగా ఉంటుందని,జగనన్న నాయకత్వంలో రానున్న కాలంలో వైయస్‌ పాలన వస్తుందని తెలిపారు. నవరత్నాలతో ప్రతి  పేదవాడికి న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మంత్రిప్రగడ నర్శింహారావు, జిల్లా కార్యదర్శి కొవ్వూరి రాంబాబుయాదవ్, మహాళా కన్వినర్‌ బోడా లోకేశ్వరి, ప్రసాద్,రవి,బోడా వీరన్న,ప్రశాంత్,తిలక్‌ తదితరులున్నారు.

ఉత్సాహంగా వైయస్సార్‌ కుటుంబంలో చేరిక
పిఠాపురం టౌన్‌: వైయస్సార్‌ సిపి అధినేత జగన్‌మోహనరెడ్డి పిలుపు మేరకు నిర్వహిస్తున్న వైయస్సార్‌ కుటుంబం కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతుంది. బూత్‌కమిటీల సారధ్యంలో ఇంటింటికి తిరుతున్న వైయస్సార్‌ సిపి నాయకులు, కార్యకర్తల సమక్షంలో పలువురు వైయస్సార్‌ కుటుంబంలో చేరుతున్నారు. బుధవారం పట్టణంలోని 5,14,18,25 వార్డుల్లో ఈకార్యక్రమాన్ని నిర్వహించగా సుమారు 400 మందిని సభ్యులుగా చేర్పించారు. 5వ వార్డులో జరిగిన కార్యక్రమంల కౌన్సిల్‌ ప్రతిపక్షనేత గండేపల్లి బాబి, పట్టణ పార్టీ అధ్యక్షుడు బొజ్జా రామయ్య తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ జగన్‌మోహనరెడ్డి ప్రకటించిన నవరత్నాల గురించి ప్రజలకు వివరిస్తున్నట్టు తెలిపారు. వైయస్ జగన్ అధికారంలోకి వచ్చాక పేదల కష్టాలు తీరతాయన్నారు. త్వరలో పేద, బడుగు, బలహీన వర్గాల వారికి మంచి రోజులు వస్తాయన్నారు. ఇంటింటి తిరిగి వైయస్సార్‌ కుటుంబానికి గుర్తుగా స్టిక్కర్స్‌ను అంటిస్తున్నారు. ఈకార్యక్రమంలో పార్టీ పరిశీలుకుడు గౌస్‌ మొహీద్దీన్, బూత్‌ కమిటీ సభ్యులు, నాయకులు బత్తుల సాయి, కర్రి రాంబాబు, అయితే శోభ, కొంగు బాబి, సాలా మీరయ్య, ఆలీ బి.సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

వైయస్సార్‌ కుటుంబంలో చేరండి
ఐ.పోలవరం: వైయస్సార్‌ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాలతో అందరికీ లబ్ధి చేకూరుతుందని, ప్రతిఒక్కరూ వైయస్సార్‌ కుటుంబంలో చేరాలని ఆపార్టీ మండల కన్వీనర్‌ పిన్నంరాజు వెంకటపతిరాజు(శ్రీను) కోరారు. బూత్‌ కమిటీల ఆధ్వర్యంలో బుధవారం కేశనకుర్రులో వైయస్సార్‌ కుటుంబం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందుకూరి రంగరాజు, బొంతు కనకారావు, మోకా రవి, పెమ్మిరెడ్డి వినాయకరావు, ఎం.రాజేశ్వరరావు, వాసంశెట్టి లోవరాజు, యిళ్ల గణేష్, చిక్కం తాతాజీ, పిల్లి రాంబాబు, మట్టా జయగౌడ్, యలమంచలి వాసు, షేక్‌ సుబహాన్, ఎం.ప్రసన్నగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

అన్నవరంలో జోరుగా ‘ వైయస్‌ఆర్‌ కుటుంబం ’ కార్యక్రమం
అన్నవరం: అన్నవరంలో ‘వైయస్‌ఆర్‌ కుటుంభం’ కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి పార్టీ అధినేత  జగన్మోహన్‌రెడ్డి ప్రతిపాదించిన నవరత్నాల కార్యక్రమం గురించి వివరిస్తున్నారు. బుధవారం ఒకటో నెంబర్‌ బూత్‌ కన్వీనర్‌ వెదురుపాక మూర్తి, మూడవ నెంబర్‌ బూత్‌ కన్వీనర్‌ తాటిపాక కృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ రెండు వార్డులలో 50 ఇళ్లకు వెళ్లి పార్టీ కార్యక్రమాలను వివరించి వైయస్‌ఆర్‌ కుటుంబంలో చేరమని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కొండపల్లి అప్పారావు, తాడి సత్యనారాయణ, దడాల సతీష్, బిఎస్‌వి ప్రసాద్, కొల్లు చిన్న, చామంతి శ్రీను, కొండి ప్రకాష్, రాజాన రామరాజు, కాండ్రకోట రాజు, తదితరులు పాల్గొన్నారు. గ్రామంలోని మిగిలిన బూత్‌ లలో కూడా వైఎస్‌ఆర్‌ కుటుంభం కార్యక్రమం చురుకుగా జరుగుతోందని తెలిపారు.

వైయస్సార్‌ కుటుంబానికి జనం బ్రహ్మరథం
–జననేత జగన్‌కే ప్రజల మద్దతు
తుని: ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలను నమ్మి ఓట్లు వేసి మోసపోయామని జనం వైఎయస్సార్‌ కుటుంబం కార్యక్రమంలో ఏకరువుపెడుతున్నారు. మాట ఇస్తే తూచా అమలు చేసే రాజన్న తనయుడు జగనన్నకే మా మద్దతు ఇస్తామని జనం చెబుతున్నారు. ఏ వాడకు వెళ్లినా అప్యాయంగా పలుకరిస్తున్నారు. వైయస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో వైయస్సార్‌ కుటుంబం కార్యక్రమం ఉత్సాహంగా జరుగుతుంది. తుని నియోజకవర్గంలోని మూడు మండలాలు, పట్టణంలో బుధవారం వైయస్సార్‌ కుటుంబం కార్యక్రమాన్ని నాయకులు, కార్యకర్తలు, బూత్‌ కమిటీ సభ్యులు నిర్వహించారు. పట్టణంలో 2,16,20,21 వార్డులలో ఇంటింటా ప్రచారం చేశారు. టీడీపీ ప్రభుత్వం మూడున్నర ఏళ్లలో చేసిన అభివృద్ధి కంటే అవినీతి ఎక్కువని నాయకులు ప్రజలకు వివరించారు. అందరికి సంక్షేమ పథకాలను చేరువ చేసేందుకు జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాలను ప్రకటించారని పట్టణశాఖ కన్వీనర్‌ రేలంగి రమణాగౌడ్, జిల్లా కార్యదర్శి అనిశెట్టి సూర్యచక్రరెడ్డి అన్నారు. అందరితో మిస్‌డ్‌ కాల్‌తో సభ్యత్వ నమోదు చేయించారు. ప్రజల నుంచి వస్తున్న స్పందన నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహన్ని నింపింది. బూత్‌ కమిటీ కన్వీనర్లు కొండా వెంకట్రావు, త్రిమూర్తులు, చింతల శ్రీను, మీలా బుజ్జి, దూలం గోపి, కనిగిరి వెంకటరమణ, అదిరిపాటివీరబాబు, బుడ్డిగ దారేష్, నాయకులు నార్ల రత్నాజీ, రెడ్డి సోమరాజు, పైలా వాసు, అన్నవరం శ్రీను, దండెం నాగు పాల్గొన్నారు.

నవరత్నాల ద్వారా ప్రజల సమస్యలు పరిష్కారమవుతాయి
మామిడికుదురు: నవరత్నాల ద్వారా ప్రజల సమస్యలు పరిష్కారమవుతాయని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పి.గన్నవరం నియోజకవర్గ కో–ఆర్డినేటర్‌ కొండేటి చిట్టిబాబు పేర్కొన్నారు. వైయస్సార్‌ కుటుంబం కార్యక్రమంలో భాగంగా బుధవారం నగరం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో కో–ఆర్డినేటర్‌ చిట్టిబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిట్టిబాబు మాట్లాడుతూ... దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి అందించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు పునః ప్రారంభం కావాలంటే జగనన్న రాజ్యం రావాలన్నారు. దీని కోసం ప్రతి ఒక్కరు వైయస్సార్‌ సీపీకి అండగా నిలవాలన్నారు. పార్టీ శ్రేణులు నవ్యాంధ్రకు నవరత్నాల వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ కరపత్రాలు పంచారు. మండల పరిధిలోని బి.దొడ్డవరం గ్రామంలో కూడా వైయస్సార్‌ కుటుంబం కార్యక్రమం జరిగింది. ఆయా కార్యక్రమాల్లో పార్టీ నాయకులు చిట్టూరి రామకృష్ణ, గుబ్బల నాగరాజు, కొమ్మూరి వీరరాఘవరాజు, చిట్టూరి వీరాస్వామి, మొల్లేటి శ్రీనివాస్, అక్బర్‌ అలీ, అన్వర్‌తాహిర్‌ హుస్సేన్, కాండ్రేగుల శ్రీనివాస్, బొలిశెట్టి శ్రీను, చెల్లుబోయిన రామగణపతి, కేదారిశెట్టి మల్లి, బద్దే రామకృష్ణ, పల్లి వెంకటేశ్వరరావు, వాకపల్లి వీరాస్వామి, సుంకర గంగాచలం, వాసంశెట్టి శ్రీరామ్మూర్తి, చింతపల్లి శ్రీనివాసరావు, కొల్లా సత్తిబాబు, కుంపట్ల పెద్దిరాజు, కూరపాటి వెంకటేశ్వరరావు, చెల్లుబోయిన రామశివ సుబ్రహ్మణ్యం, నాగళ్ల దుర్గాప్రసాద్, బొక్కా గురుప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Back to Top