మ‌హానేత ప‌థ‌కాల‌కు తూట్లు

ప్ర‌కాశం:  దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కాల‌కు టీడీపీ ప్ర‌భుత్వం తూట్లు పొడుస్తోంద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ క‌నిగిరి నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త బుర్ర మ‌ధుసూద‌న్‌యాద‌వ్ అన్నారు. కనిగిరి మండలం చాకిరాల పంచాయతీలోని ఎస్సీ కాల‌నీ, భూతంవారి పల్లె లో  గడప గడపకు వైయస్ఆర్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా బుర్రా మధుసూధన్ యాదవ్ కు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.  ముందుగా గ్రామంలోని దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ఆర్ విగ్ర‌హానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. అనంత‌రం బుర్రా మధు మాట్లాడుతూ..ఎన్నిక‌ల‌కు ముందు చంద్ర‌బాబు రైతు, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామ‌ని హామీ ఇచ్చి మాట త‌ప్పార‌న్నారు. నాడు బాబు వ‌స్తే జాబు వస్తుంది అని ప్ర‌చారం చేసి, తీరా అధికారంలోకి వ‌చ్చాక ఉన్న ఉద్యోగాలు పీకేస్తున్నార‌ని విమ‌ర్శించారు. మ‌హానేత ప్ర‌వేశ‌పెట్టిన ఆరోగ్య‌శ్రీ‌, ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌, 108 వంటి ప‌థ‌కాల‌కు తూట్లు పొడుస్తున్నార‌ని మండిప‌డ్డారు. చంద్రబాబు ప్రజలకు చేస్తున్న మోసాలను మ‌ధు ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు. అనంత‌రం ఇంటింటా ప‌ర్య‌టించి ప్ర‌జాబ్యాలెట్ పంపిణీ చేశారు. 

Back to Top