మ‌హానేత ప‌థ‌కాల‌కు తూట్లు

ప్ర‌కాశం:  దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ప్ర‌వేశ‌పెట్టిన సంక్షేమ ప‌థ‌కాల‌కు చంద్ర‌బాబు ప్ర‌భుత్వం తూట్లు పొడుస్తోంద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కందుకూరు నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త తూమాటి మాధ‌వ‌రావు మండిప‌డ్డారు. నియోజకవర్గ లోని గూడ్లురు మండలం కొత్తపేట పంచాయతీ లో గడపగడపకూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ..వైయ‌స్ఆర్ ప్ర‌వేశ‌పెట్టిన ఆరోగ్య‌శ్రీ, ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ ప‌థ‌కాల‌కు నిధులు కేటాయించ‌కుండా ప్ర‌భుత్వం అన్యాయం చేస్తుంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. వైయ‌స్ జ‌గ‌న్ సీఎం అయితేనే రాజ‌న్న ప‌థ‌కాల‌కు జీవం వ‌స్తుంద‌న్నారు. కార్య‌క్ర‌మంలో గూడ్లురు జెట్పిటిసి శ్రీ వెంకట రామిరెడ్డి  , కందుకూరు యూత్ అధ్యక్షులు శ్రీ పొడపాటి కోటేశ్వరరావు , గూడ్లురు కన్వీనర్ శ్రీ క్రిష్ణ , గూడ్లురు యూత్ కన్వీనర్ శ్రీ కిశోర్ , ఎస్సీ సెల్ కన్వీనర్ శ్రీ మేథుషళ, రవి , వెంకట్ రావు , హరినఁద్ర రెడ్డి  
- క‌నిగిరి నియోజ‌క‌వ‌ర్గంలోని సీఎస్ పురం మండ‌లం పుల్ల‌గూర‌ప‌ల్లి గ్రామంలో పార్టీ ఇన్‌చార్జ్ ప‌ర్య‌టించారు.
- సంత‌మాగులూరు మండ‌లంలో పార్టీ అద్దంకి నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త గ‌రిట‌య్య ప‌ర్య‌టించి ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. 

Back to Top