కాలువలు శుభ్రం చేయకపోవడంతో దుర్గంధం వెదజల్లుతోంది

కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్ ఏడవ వార్డులోని చిత్తారివీధి నీళ్ల ట్యాంకు ప్రాంతంలో గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి ప్రజాబ్యాలెట్ పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు తమ సమస్యలను హఫీజ్ ఖాన్ దృష్టికి తీసుకొచ్చారు. సరైన చెత్తకుండి లేకపోవడంతో చెత్తంతా ఇళ్లలోకి వస్తోందని వాపోయారు. వారానికి ఒకసారి కూడా కాలువలు శుభ్రం చేయకపోవడంతో దుర్గంధం వెదజల్లుతోందన్నారు. పింఛన్లు రావడం లేదని వికలాంగులు, వృద్ధులు ఆవేదన వ్యక్తం చేశారు. వార్డు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హఫీజ్ ఖాన్ వారికి భరోసా ఇచ్చారు.


Back to Top