మోసకారి బాబును సాగనంపుదాం

ప్ర‌జావంచ‌కుడు చంద్ర‌బాబు
డోన్))న‌మ్మిన వారిని వంచించ‌డ‌మే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నైజ‌మ‌ని పీఏసీ చైర్మ‌న్, వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యే బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి విమ‌ర్శించారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వైయ‌స్ఆర్ సీపీ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న అలేబాదు తండా గ్రామ‌ల్లో ప‌ర్య‌టించారు. ఈసందర్భంగా ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నిక‌ల ముందు ఆచ‌ర‌ణ సాధ్యం కాని హామీలు ఇచ్చినా ప్ర‌జ‌లు ఎంతో న‌మ్మ‌కంతో చంద్ర‌బాబును గెలిపించార‌న్నారు. రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేయ‌క‌పోయినా చేసిన‌ట్లు న‌మ్మించ‌డం బాబుకే చెల్లింద‌న్నారు. ఇంటికో ఉద్యోగం లేదు. నిరుద్యోగులు క‌ళ్లు కాయ‌లు కాసేలా ఎదురు చూస్తున్నారు. కొత్త కొలువుల మాట దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలు తొల‌గిస్తున్నార‌ని మండిప‌డ్డారు. మోస‌పు వాగ్దానాలు చేసిన బాబును ఇంటికి పంపేందుకు ప్ర‌జ‌లు సిద్ధంగా ఉన్నార‌న్నారు. వైయ‌స్ఆర్ సీపీ అధికారంలో వ‌స్తే పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తీరుతాయ‌ని ఆయ‌న భ‌రోసా ఇచ్చారు. మ‌ళ్లీ రాజ‌న్న రాజ్యం తీసుకురావ‌డానికి వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వెంట న‌డిచేందుకు ప్ర‌జ‌లు సిద్ధంగా ఉన్నార‌న్నారు. కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్ సీపీ నాయ‌కులు, కార్య‌కర్త‌లు పాల్గొన్నారు.

గ‌డ‌ప‌గ‌డ‌ప‌లో ప్ర‌జ‌ల ఆవేద‌న‌
బ‌న‌గాన‌ప‌ల్లె))సీఎం చ‌ద్ర‌బాబు రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు చేసిన మోసం మ‌రువ‌రానిద‌ని రామ‌తీర్థం ప్ర‌జ‌లు బ‌న‌గాన ప‌ల్లె వైయ‌స్ఆర్ సీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్ కాట‌సాని రామిరెడ్డి ముందు వాపోయారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వైయ‌స్ఆర్ సీపీ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించారు. గ్రామానికి మంజూరైన 13 మంది పింఛ‌న్లు, 23 మంది రేష‌న్ కార్డుల‌ను జ‌న్మ‌భూమి క‌మిటీ స‌భ్యుల ఒత్తిడితో అధికారులు ర‌ద్దు చేశార‌ని గ్రామ‌స్తులు వాపోయాపు. ఎస్సీ, ఎస్టీ కాల‌నీలో తాగునీటి స‌మ‌స్య ఉంద‌ని ప్ర‌జ‌లు త‌మ గోడును వివ‌రించారు. కాటసాని మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా గ్రామంలో పాఠ‌శాల‌ను బాగు చేశాన‌ని, అర్హులైన ప్ర‌తిఒక్క‌రికీ ప‌క్కా ఇళ్లు, పింఛ‌న్లు, రేష‌న్ కార్డులు ఇప్పించామ‌ని ఆయ‌న ప్ర‌జ‌ల‌కు గుర్తుచేశారు. టీడీపీ పాలన‌కు ప్ర‌జ‌లు సున్నా మార్కులే వేస్తున్నార‌ని ఆయ‌న తెలిపారు.


బాబు పాలనంతా అవినీతిమయం
శ్రీశైలం))రాష్ట్ర సీఎం గా చంద్ర‌బాబు పూర్తిగా విఫ‌ల‌మ‌య్యార‌ని, ఆయ‌న పాల‌న‌లో అభివృద్ధి శూన్య‌మ‌ని, అవినీతి తారాస్థాయికి చేరింద‌ని వైయ‌స్ఆర్ సీపీ శ్రీశైలం నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్ బ‌ుడ్డా శేషారెడ్డి విమ‌ర్శించారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వైయ‌స్ఆర్ సీపీ కార్య‌క్ర‌మంలో భాగంగా జీసీపాలెం, నెమ‌ళ్ల‌కుంట‌, గిరిజ‌న తండాలో ప‌ర్య‌టించారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు తిరిగి గిరిజ‌నుల‌, గ్రామ‌స్తుల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. శేషారెడ్డి స్పందిస్తూ వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అధికారంలోకి వ‌స్తే గిరిజ‌నుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తామ‌న్నారు. ప్ర‌స్తుత ప్ర‌భుత్వంలో ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకొనే వారు క‌రువ‌య్యార‌న్నారు. బాబు పాల‌న‌లో రాజ‌ధాని దొపిడీ, అగ్రిగోల్డ్ కుభ‌కోణం, ప‌ట్టిసీమ‌, ఎత్తిపోత‌ల ప‌థ‌కంలో అవినీతి, స‌దావ‌ర్తి స‌త్రం భూముల దోప‌డీ, ఇసుక మాఫీయా ఇలా అన్నింటిలోనూ అవినీతి, అక్ర‌మాలు చోటుచేసుకున్నాయ‌న్నారు. కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్ సీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

చంద్ర‌బాబును న‌మ్మి మోస‌పోయాం
ప‌త్తికొండ‌))స‌కాలంలో వాన‌లు రాక, పెట్టిన పెట్టుబ‌డులు కూడా చేతికంద‌క ఏటా అప్పుల పాల‌వుతున్నామ‌ని రైతులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రెండేళ్ల‌యినా క‌రువు డ‌బ్బులు ఇవ్వ‌లేద‌ని దాని ఊసే ఎవ‌రూ ఎత్త‌డం లేదంటూ ఆయా గ్రామాల రైతులు త‌మ గోడు చెప్పుకుంటున్నారు. అన్నీ ఇస్తామ‌ని చెప్పి చంద్ర‌బాబు న‌మ్మించి మోసం చేశాడ‌ని ప్ర‌జ‌లు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కార్య‌క్ర‌మంలో భాగంగా వైయ‌స్ఆర్ సీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జి చెరుకుల‌పాడు నారాయ‌ణ‌రెడ్డి మండ‌లంలోని కొత్త‌ప‌ల్లి గుడిసెల‌, రామ‌లింగాయ‌పల్లి, చెన్నంప‌ల్లి గ్రామాల్లో ప‌ర్య‌టించారు. ప్ర‌తిగ‌డ‌ప‌కు వెళ్లి ప్ర‌జ‌ల బాధ‌లు విన్నారు. ఆయ‌నతో స్థానికులు మాట్లాడుతూ ఇళ్లు, పింఛ‌న్లు ఇవ్వ‌డం లేదు, వేల‌కు వేలు క‌రెంటు బిల్లులు, ఫ్లోరైడ్ నీళ్లు, స‌క్ర‌మంగా కాని రుణ‌మాఫీ, పెరిగిన నిత్యావ‌స‌ర స‌రుకుల‌తో బ‌తుకు భారంగా మారింద‌ని, కుటుంబాల పోష‌న‌కు త‌మ ఆదాయం స‌రిపోవ‌డం లేద‌ని ప్ర‌జ‌లు వాపోయారు. 

Back to Top