అవినీతి పాలనను తరిమికొడదాం

రాష్ట్రవ్యాప్తంగా గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. గడపగడపలో వైయస్సార్సీపీ శ్రేణులను ప్రజలు అక్కున చేర్చుకొని ఆదరిస్తున్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 17వ డివిజన్ లో గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు సంబంధించి ప్రజలకు కరపత్రాలు అందించి సమాధానాలు రాబట్టారు. బాబు పాలనపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 


కృష్ణాజిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం  వత్సవాయి మండలం చినమోదుగుపల్లి  గ్రామంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని ఉదయభాను గడప గడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా చంద్రబాబు చేస్తున్న మోసాలను గడపగడపలో ఎండగట్టారు. అబద్ధపు హామీలతో నయవంచన చేసిన చంద్రబాబు సర్కార్ కు చరమగీతం పాడుదామని పిలుపునిచ్చారు.  

ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం సీఎస్ పురం మండలం పెద్దగోగుల పల్లి గ్రామంలో బుర్రా మధుసూదన్ ఆధ్వర్యంలో గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం సాగుతోంది. ఎన్నికల్లో బాబు ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి మార్కులు వేయాలని ప్రజలకు కరపత్రాలు అందించారు. ఈసందర్భంగా ప్రజలు బాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
కర్నూలు జిల్లా డోన్ ఎమ్మెల్యే రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్ఎస్ రంగాపురం గ్రామంలో గడపగడపలో పర్యటించారు.బనగానపల్లె నియోజకవర్గ ఇంఛార్జ్ కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో బి. పల్లి మండలం, టంగుటూరు గ్రామంలో గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం సాగింది. శ్రీశైలం నియోజకవర్గ ఇంఛార్జ్ బుడ్డా శేషారెడ్డి ఆధ్వర్యంలో జి.సి. పురంలో, ఆళ్లగడ్డ నియోజకవర్గ ఇంఛార్జ్ రామలింగారెడ్డి ఆధ్వర్యంలో రుద్రవరం మండలం, మండలూరు గ్రామంలో గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ జరిగింది. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ, వారికి భరోసానిస్తూ నేతలు ముందుకు సాగుతున్నారు. చంద్రబాబు అవినీతి, అరాచక పాలనను తరిమికొడదామని ప్రజలకు పిలుపునిచ్చారు. 


తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top