ఏ గ‌డ‌ప‌కెళ్లినా స‌మ‌స్య‌లే...!

ప్ర‌త్తిపాడు: ఏ గ‌డ‌ప‌కూ వెళ్లినా... ఏ మ‌నిషిని ప‌ల‌క‌రించినా స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నార‌ని తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజ‌క‌వ‌ర్గ కో-ఆర్డినేట‌ర్ ప‌ర్వ‌త పూర్ణ‌చంద్ర‌ప్ర‌సాద్ అన్నారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న మండ‌ల ప‌రిధిలోని రౌతుపాలెం గ్రామంలో ప‌ర్య‌టించి ప్ర‌జ‌ల‌ స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... ప్ర‌జ‌లంతా చంద్ర‌బాబు మోస‌పూరిత పాల‌న‌పై మండిప‌డుతున్నారన్నారు. ఏరు దాటే వర‌కు గ‌ట్టు మ‌ల్ల‌న్న.... ఏరు దాటాకా బోడి మ‌ల్ల‌న్న అన్న చందంగా చంద్ర‌బాబు పాల‌న తీరు ఉంద‌ని ఎద్దేవా చేశారు. ప్ర‌జ‌ల కోసం నిరంత‌రం పోరాడుతున్న ఏకైక పార్టీ వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అని, 2019 ఎన్నిక‌ల్లో వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఘ‌న విజ‌యం సాధిస్తుంద‌ని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు. అనంత‌రం వంద ప్ర‌శ్న‌ల‌తో కూడిన ప్ర‌జాబ్యాలెట్‌ను ప్ర‌జ‌ల‌కు అంద‌జేసి బాబు పాల‌న‌పై మార్కులు వేయించారు. 
Back to Top