అస్తవ్యస్థ పాలనతో అవస్థలు

సంక్షేమ పథకాలకు తూట్లు
తూర్పుగోదావరి(మండపేట): వైయస్సార్సీపీ ప్రతిష్టాత్మంగా చేపట్టిన గడపగడపకూ కార్యక్రమం రెండునెలలు పూర్తి చేసుకొని విజయవంతంగా కొనసాగుతోంది. గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా మండపేట సమన్వయకర్త పట్టాబి రామయ్య  చౌదరి  మండపేట రూరల్ మండలంలోని వేలగతోడు గ్రామంలో పర్యటించారు. ఈసందర్భంగా ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రోడ్లు, డ్రైనేజీలు అధ్వాన్నంగా ఉన్నాయని... రేషన్, పింఛన్, గృహనిర్మాణ బిల్లులు అందడం లేదని ప్రజలు పట్టాబి వద్ద ఆవేదన వెలిబుచ్చారు. ఈసందర్భంగా రామయ్యచౌదరి మాట్లాడుతూ...ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించి వంచించిన చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 

కలెక్టర్ దృష్టికి ప్రజాసమస్యలు
నెల్లూరు(సూళ్లూరుపేట): గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను వైయస్సార్సీపీ సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య కలెక్టర్ ముత్యాలరాజు దృష్టికి తీసుకెళ్లారు. ప్రతీ మండలంలో పింఛన్ అందని అర్హులు ఎంతోమంది ఉన్నారని, ఈపాస్ విధానంలోని సాంకేతిక సమస్యల వల్ల వందలాది నిరుపేద కుటుంబాలకు రేషన్ సరుకులు అందడం లేదని..తాగునీటి సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని...మరుగుదొడ్ల నిర్మాణ బాధ్యతను అధికార పార్టీ నేతలు అసంపూర్తిగా వదిలేసి నిధులు మింగేశారని, నీరు‍చెట్టులో టీడీపీ విపరీతంగా అవినీతికి పాల్పడుతోందని కలెక్టర్ కు వివరించారు. చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. 
బాబు దురాగతాలను ఎండగట్టిన ధర్మాన
శ్రీకాకుళం(నరసన్నపేట): మాజీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ నరసన్నపేట నియోజకవర్గం పోలాకి మండలం జడూరు గ్రామపంచాయతీలో గడపగడపలో పర్యటించారు. ఈసందర్భంగా ప్రజలు ధర్మానకు బొట్టుపెట్టి హారతిచ్చి మహిళలు ఘనస్వాగతం పలికారు. ఈసందర్భంగా ధర్మాన...వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు అవినీతి, అక్రమాలను ఎండగట్టారు. 


Back to Top