టీడీపీ వచ్చాక అన్నీ ఇబ్బందులే

ఇంటింటికీ బాబు మోసాలు
శ్రీకాకుళం(టీకేఆర్ పురం)) స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నామ‌ని టీకేఆర్ పురం గ్రామ గిరిజ‌నులు వైయ‌స్ఆర్ సీపీ జిల్లా అధ్య‌క్షురాలు రెడ్డిశాంతి దృష్టికి తీసుకువ‌చ్చారు. మెయిన్ రోడ్డునుంచి గ్రామంలోనికి వెళ్లేందుకు ర‌హ‌దారి బాగోలేద‌ని దీంతో ఇబ్బందులు ప‌డుతున్నామ‌ని స్థానికులు ఆమె విన్నవించారు. ఇళ్లు, ఫించ‌న్లు అంద‌డం లేద‌ని వాపోయారు. తెలుగుదేశం ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత త‌మ గ్రామానికి ఏ ఒక్క అభివృద్ధి ప‌థ‌కం మంజూరు చేయ‌లేద‌న్నారు. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాలు, ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌పై వంద ప్ర‌శ్న‌ల‌తో కూడిన క‌ర‌ప‌త్రాల‌ను రెడ్డి శాంతి ఇంటింటికీ పంపిణీ చేశారు. కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్ సీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

బాబు సర్కార్ పై ప్రజాగ్రహం
(నందిగాం)) గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో మంజూరైన కాల‌నీ ఇళ్ల‌కు ఇంత వ‌ర‌కు బిల్లులు చెల్లించ‌లేద‌ని ల‌బ్ధిదారులు వాపోయారు. నందిగాం మండ‌లం క‌ర్ల‌పూడి పంచాయ‌తీ చిన్న‌తామ‌రాప‌ల్లిలో వైయ‌స్ఆర్ సీపీ నియోజ‌క‌వ‌ర్గ అద‌న‌పు స‌మ‌న్వ‌య‌క‌ర్త పేరాడ తిల‌క్ ఆధ్వ‌ర్యంలో గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వైయ‌స్ఆర్ సీపీ కార్య‌క్రమం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా గ్రామంలో ప్ర‌తి ఇంటికీ వెళ్లి తెలుగుదేశం ప్ర‌భుత్వం ఎన్నిక‌ల ముందు ఇచ్చిన హామీలు ఎంత‌మేర‌కు అమ‌లు అయ్యాయో అడిగి తెలుసుకున్నారు. బాబు పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్ సీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top