గిరిజ‌న అభివృద్ధి కుంటుప‌డింది

విశాఖః చంద్ర‌బాబు ప్ర‌భుత్వ హ‌యాంలో గిరిజ‌న అభివృద్ధి కుంటుప‌డింద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు మండిప‌డ్డారు. విశాఖ జిల్లా అర‌కు నియోజ‌క‌వ‌ర్గం వాలీ మండ‌లం కొత్త బ‌లియ‌గుడ్ పంచాయ‌తీ బొందుగుడా గ్రామంలో గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఇంటింటికి తిరుగుతూ టీడీపీ మోసాల‌పు హామీల‌పై ముద్రించిన ప్ర‌జాబ్యాలెట్‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో పార్టీ క‌న్విన‌ర్లు అరుణ‌కుమారి, పోయా రాజారామ్‌, సూర్య నారాయ‌ణ‌, శెట్టి అప్పాలు త‌దిత‌రులు పాల్గొన్నారు. 


Back to Top