అబద్ధపు హామీలతో కాలయాపన

బాబు పాలనపై పెల్లుబికుతున్న ఆగ్రహం
గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంగా దిగ్విజయంగా కొనసాగుతోంది. విశాఖ డిల్లా యలమంచిలి నియోజకవర్గ కన్వీనర్ ప్రగడ నాగేశ్వరరావు ములకపల్లి గ్రామంలో గడగడపలో పర్యటించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కరపత్రాలు అందించి బాబు పాలనకు మార్కులు వేయించారు. బాబుపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం పెల్లుబికింది. మరోవైపు, కర్నూలు జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య పగిడ్యాల పట్టణంలో గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా బాబు మోసాలను ప్రజలకు వివరించారు. 

వైయస్సార్సీపీ కార్పొరేటర్ల డివిజన్ లపై వివక్ష
నెల్లూరు నగరంలోని 9వ డివిజన్ పుల్లమ్మసత్రం, కుసుమ హరిజనవాడ ప్రాంతాల్లో... డివిజన్ కార్పొరేటర్ రాజశేఖర్, డిప్యూటీ మేయర్ ద్వారక్ నాథ్ లతో కలిసి ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు రూ.42 కోట్ల వరకు మంజూరైనా... మేయర్ ఇంతవరకు ఆ పనులకు టెండర్లు పిలవకుండా ఒకే కాంట్రాక్టర్ కు అప్పగించి కమీషన్ లతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు.   వైయస్సార్సీపీ కార్పొరేటర్ల డివిజన్ల పట్ల మేయర్ చిన్నచూపు చుడడం తగదన్నారు. 9వ డివిజన్ ను దత్తత తీసుకుంటున్నానని చెప్పిన మేయర్ దాన్ని పట్టించుకున్న పాపాన పోవడం లేదన్నారు. ఇప్పటికైనా కోటిన్నర రూపాయలు కేటాయించి డివిజన్ అభివృద్ధికి తోడ్పడాలన్నారు. 

ఇళ్లు ఎప్పుడు కట్టిస్తారు బాబు
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 18,19 డివిజన్ లలోని రాజీవ్ గాంధీ కాలనీ, ఆనం వెంకటరెడ్డి నగర్, సర్వేపల్లి కాలువ కట్టలలో గడపగడపలో పర్యటించారు. ప్రతీ పేదవాడికి లక్షన్నర రూపాయలతో పక్కాఇళ్లు కట్టిస్తానన్న చంద్రబాబు...అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లవుతున్నా ఇంతవరకు ఒక్క ఇళ్లు కట్టించలేదన్నారు. గతంలో కట్టిన ఇళ్లకు బిల్లులు మంజూరు చేయకపోవడంతో పేదలు వాటిని తీర్చడం కోసం అప్పులు చేస్తూ అవస్థలు పడుతున్నారన్నారు. ఇప్పటికైనా బాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. అర్హులైన పేదలందరికీ పక్కా ఇళ్లు కట్టించాలని డిమాండ్ చేశారు.

తాజా వీడియోలు

Back to Top